భారత్ పర్యటన ఎప్పటికీ మర్చిపోలేను: ట్రంప్
Send us your feedback to audioarticles@vaarta.com
అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల పర్యటన అనంతరం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ పర్యటన ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన చెప్పుకొచ్చారు. భారత్‌లో అద్భుతమైన ఆతిథ్యం లభించిందని.. ప్రధాని మోదీతో బలమైన మైత్రి ఏర్పడిందన్నారు. ‘భారత్‌లో 140 కోట్ల మంది ప్రజల మార్కెట్ ఉంది. భారత్‌తో 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం చేసుకున్నాం. భారత్‌కు మరిన్ని ఆయుధాలు విక్రయిస్తాం. ఇంధన రంగంలో మా పెట్టుబడులు పెరిగాయి. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెడతాం. భారత్ సీఈవోలతో సమావేశం సంతృప్తినిచ్చింది. బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే సమర్థులు భారత్‌లో ఉన్నారు. ప్రమోటర్లకు భారత్ స్వర్గధామం’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
భారత్ ఎప్పుడూ శాంతినే..!
‘ప్రధాని మోదీతో తాలిబన్ శాంతి ఒప్పందంపై చర్చించాం. తాలిబన్లతో శాంతి ఒప్పందం భారత్‌కు మేలు చేస్తుంది. ఉగ్రవాదులపై మా దాడులు కొనసాగుతాయి. అల్ బాగ్దాదీని మేమే హతమార్చాం. ఇరాక్ ఐసిస్‌ను అదుపు చేయాల్సిందే. ఇక ఆప్ఘనిస్తాన్‌లో మేం పోలీసింగ్ చేయబోం. ఐసిస్‌కు వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకమవ్వాలి. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటోంది. భారత్ ఇంతగా ఎప్పుడూ అమెరికాను అభిమానించలేదు’ అని ట్రంప్ తెలిపారు.
భారత్-పాక్‌తో సమానంగా సత్సంబంధాలు!
‘మత స్వేచ్ఛపై మోదీతో చర్చించా. మత స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నామంటూ మోదీ చెప్పారు. భారత్‌లో అన్ని మతాలను సమానంగా చూస్తున్నారు. సీఏఏ అంశంపై మోదీతో ఎలాంటి చర్చలు జరపలేదు. ఢిల్లీ అల్లర్లు ఈ దేశ అంతర్గత వ్యవహారం. మానవ హక్కులను మేం గౌరవిస్తాం. భారత్, పాకిస్తాన్‌తో నాకు సమానంగా సత్సంబంధాలు ఉన్నాయి. భారత్- పాకిస్తాన్ మధ్య కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. కశ్మీర్ వివాదంలో చాలా సంక్లిష్టమైన అంశాలున్నాయి. ప్రతి అంశానికి రెండు కోణాలు ఉంటాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో మంచి సంబంధాలున్నాయి. అవసరమైతే భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తా. పాకిస్తాన్లో అరాచక శక్తులను నియంత్రిస్తున్నాం. ఉగ్రవాదాన్ని మోదీ ఎదుర్కోగలరు. మోదీ మాటల్లోనే కాదు.. చేతల్లోనూ ధృడంగా ఉంటారు’ అని ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఐదు ఒప్పందాలు!
కాగా.. ట్రంప్ పర్యటనతో భారత్- అమెరికా మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ఆర్థిక, వాణిజ్య, రక్షణాంశాల్లో రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంతుకుమందు మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ట్రంప్‌కు ఘనస్వాగతం లభించింది. ట్రంప్ దంపతులకు రామ్‌నాథ్ కోవింద్, మోదీ ఘనస్వాగతం పలికారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout