ఛాలెజింగ్ వ‌ర్క్స్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డతాను - సంగీత ద‌ర్శ‌కుడు ఛైత‌న్య భ‌ర‌ధ్వాజ్

  • IndiaGlitz, [Wednesday,July 22 2020]

ఆరె ఎక్స్ 100 సినిమా ఎంత హిట్ అయిందో దానికి మించిన విజ‌యాన్ని సాధించాయి ఆ చిత్రంలో పాట‌లు..! మ‌రీ ముఖ్యంగా ఈ ఆల్బ‌మ్ లో పిల్ల రా అనే పాటకి వ‌చ్చినంత క్రేజ్ గురించి వేరేగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ పాట‌కు ప్రాణం పోసి, త‌న దైన శైలిలో ప‌లు చిత్రాలకు బాణీలు అందిస్తున్నారు హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ చైతన్య భ‌ర‌ధ్వాజ్. అన‌తి కాలంలోనే ప‌లు హిట్ సినిమాల‌కి, స్టార్ హీరోల చిత్రాల‌కు మ్యూజిక్ అందిచే స్థాయికి చేరుకున్న చైత‌న్య త‌న పెట్టిన‌రోజు సంద‌ర్భంగా (జూలై 22) కొన్ని విష‌యాలు పంచుకున్నారు.

సాఫ్ట్ వేర్ టూ సినీ ఫిల్డ్

వాస్త‌వానికి సినిమాల్లోకి వ‌చ్చే సాఫ్ట్ వేర్ వాళ్లు హీరోలు, హీరోయిన్లు లేదా డైరెక్ట‌ర్లుగా నిల‌దొక్కుకోవాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌స్తుంటారు. కానీ చైత‌న్య భ‌ర‌ధ్వాజ్ మాత్రం మ్యూజిక్ మీద మక్కువతో సాఫ్ట‌వేర్ ఫిల్డ్ ని వ‌దిలేస్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. శ్రేయాస్ మీడియా వారు తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా చైత‌న్య మ్యూజికల్ టాలెంట్ ఇండ‌స్ట్రీకి తెలిసింది. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన డైరెక్ట‌ర్ ర‌మేశ్ వ‌ర్మ, తానే నిర్మించే 7 అనే సినిమాకు చైత‌న్య‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా వ‌ర్క్స్ లో ఉండ‌గానే చైత‌న్య‌కు ఆర్ ఎక్స్ 100 డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి నుంచి పిలుపు వ‌చ్చింది. అలానే 7 కంటే ఆర్ ఎక్స్ 100 చిత్ర‌మే ముందుగా రిలీజ్ అవ్వ‌డంతో చైత‌న్య మ్యూజిక్ డైరెక్ష‌న్ చేసిన తొలి సినిమాగా ఆర్ ఎక్స్ 100 అయింది.

ఛాలెజింగ్ మ్యూజిక్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను

ఆరె ఎక్స్ 100 పాట‌లకు యావ‌త్ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయాయి. దీంతో ఓవ‌ర్ నైట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా మారిపోయారు చైత‌న్య భ‌ర‌ధ్వాజ్. అయితే ఆరె ఎక్స్ 100 ద్వారా వ‌చ్చిన స‌క్సెస్ ఫార్మూలాని వాడుకోవ‌డానికి చైత‌న్య ఇష్ట‌ప‌డ‌రూ. వాస్త‌వానికి ఆర్ ఎక్స్ 100 త‌రువాత త‌న‌కు అవ‌కాశాలు ఇచ్చిన ద‌ర్శ‌కులు అంద‌రూ ఛాలెజింగ్ వ‌ర్క్స్ త‌న‌కు ఇచ్చార‌ని, ఎవ్వ‌రూ ఆరె ఎక్స్ 100 టైపు సాంగ్స్ కావాల‌ని అగ‌లేద‌ని, దీని వ‌ల్ల తాను కొత్త ట్యూన్స్ చేయ‌డానికి కుదిరింద‌ని తెలిపారు. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అవుతూ శ్రోత‌ల‌కి మంచి కొత్త త‌ర‌హా మ్యూజిక్ ఇవ్వ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని తెలిపారు చైత‌న్య భ‌ర‌ధ్వాజ్.

నాగార్జున గారి నుంచి ఫోన్ రావ‌డం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను

నాగార్జున గారు ఆర్ ఎక్స్ 100 పాట‌లు విని ఫోన్ చేసి మెచ్చుకోవ‌డ‌మే కాదు, ఏకంగా తాను యాక్ట్ చేస్తున్న సినిమాకు కొత్త‌గా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన న‌న్ను మ్యూజిక్ డైరెక్ట‌ర్గా తీసుకోవ‌డం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఈ విష‌యంలో ఎప్ప‌టికీ ఆయ‌న‌కు రుణ ప‌డి ఉంటాను. అలానే నాకు అవ‌కాశాలు ఇస్తున్న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, నా సాంగ్స్ విని న‌న్ను ఆదిరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కి, మీడియా వారికి మ‌నఃస్పూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను.

More News

కరోనాతో ప్రముఖ ఫార్మాకి కంపెనీకి చెందిన తండ్రీకొడుకుల మృతి

హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ ఫార్మా పరిశ్రమ ఓనర్‌తో పాటు ఆయన కుమారుడు కరోనా కారణంగా మరణించారు.

బ్రేకింగ్: అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్

ఏపీలో వరుసగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు.

కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్

తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే.

నిమ్మగడ్డ కేసులో గవర్నర్ సంచలన నిర్ణయం.. జగన్‌కు షాక్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఆయన కేసులో గవర్నర్ విశ్వభూషన్ హరించందన్ సంచలన నిర్ణయం తీసుకుని ఏపీ సీఎం జగన్‌కు షాక్ ఇచ్చారు.

'డర్టీ హరి' మొదటి పాట 'లెట్స్ మేక్ లవ్' పూర్తి వీడియో తో ఎం.ఎస్ రాజు మరో సర్ప్రైజ్!!

ఆద్యంతం రక్తికట్టించే సన్నివేశాలతో విడుదలైన కొన్నిగంటల్లోనే విపరీతమైన ఆదరణ పొంది 1 మిలియన్ కి పైగా వ్యూస్ సంపాదించడమే కాక యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది ఎం.ఎస్ రాజు 'డర్టీ హరి` ట్రైలర్.