ఐ లైక్ ఇట్ దిస్ వే ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్
Send us your feedback to audioarticles@vaarta.com
టివి 9 యాంకర్ ప్రేమ మాలిని దర్శకత్వంలో బిగ్ బాస్ ఫెమ్ అర్చన, శివకుమార్ రామచంద్రవరపు లీడ్ రోల్స్ లో నటించిన ఐ లైక్ ఇట్ దిస్ వే ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్ షోని ఈ ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ కి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తోపాటు దర్శకుడు నీలకంఠ, దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహన కృష్ణ, హీరోయిన్ మధు షాలిని, అర్చన, ప్రేమ మాలిని, హీరో ప్రిన్స్, బిగ్ బాస్ ఫెమ్ హరితేజ, బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ శివబాలాజీ, శివబాలాజీ వైఫ్ మధుమిత, మధుర శ్రీధర్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఈ షోని తిలకించిన ప్రముఖులందరూ నటి అర్చనాని, దర్శకురాలు ప్రేమ మాలిని ప్రశంసలతో ముంచెత్తారు.
దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడుతూ: ప్రేమ గారితో నాకు ముందునుండే పరిచయం వుంది.. గోల్కొండ హైస్కూల్ సినిమా తీసినప్పుడు.. ఒక జర్నలిస్ట్ పాత్ర ఉంటె బావుంటుంది అనిపించినప్పుడు... ప్రేమ గారు ఆ సినిమాలో పార్ట్ అయ్యారని... ఇక ఈ లఘు చిత్రంలో వివిధ వివాదాస్పద అంశాలు చర్చించబడ్డాయి. ఇది చాలా కషమైన పని అని... చాలా విషయాలను ఒకే చోట పొందు పరిచి ముఖ్యంగా ఇప్పటికి మగవాళ్లలో, ఆడవాళ్ళలో చాల నాటుకుపోయిన విషయాలు గురించి ఒకే చిత్రంలో ఇలా పొందు పర్చడం అభినందించదగ్గ విషయమని చెప్పడమే కాదు.. ఆ దిశగా ప్రేమ గారు మొదటి అడుగు వేశారని చెప్పారు. అంతేకాకూండా మరిన్ని అడుగులు వేస్తూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నటి అర్చనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
శివబాలాజీ మాట్లాడుతూ: బిగ్ బాస్ హౌస్ నుండి తిగొచ్చినతర్వాత అబ్బాయిలు జాగ్రత్త పడాలని ఈ ఐ లైక్ ఇట్ దిస్ వే ఇండిపెండెంట్ ఫిలిం హింట్ ఇచ్చారని... బిగ్ బాస్ నుండి తిరిగొచ్చాక అర్చన చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పిన బాలాజీ... ప్రేమ గారు ఇలాంటి మంచి చిత్రాన్ని అందించినందుకు శుభాకాంక్షలు తెలియజేశాడు.
అర్చన మాట్లాడుతూ: తాను పిలవగానే ఆ షో చూడడానికి వచ్చిన అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన పుట్టినరోజునాడు ఇలాంటి ప్రశంసలు దక్కడం తనకి ఆనందంగా ఉందని.. నేను ప్రేమ ఎంతో ఆలోచించి సమాజంలో జరిగే చాలా వివాదస్పద అంశాల మీద ఒక కథని తయారు చేసుకుని.. ప్రేమ దర్శకత్వంలో ఈ చిత్రాన్నిలేడి ఓరియెంటెడ్ గా, సీరియస్ గా చెప్పకుండా కాస్త ఎంటెర్టైమెంట్ జోడించి ఈ కథని ప్రేమ తెరకెక్కించారని చెప్పారు. అలాగే ఈ ఐ లైక్ ఇట్ దిస్ వే ఇండిపెండెంట్ ఫిలింని యూట్యూబ్ లో విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments