Johnny Master:సీఎం జగన్ అంటే నాకు ఎంతో ఇష్టం: జానీ మాస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరూ ఎప్పుడూ ఏ పార్టీకి మద్దతు ఇస్తారో కనుక్కోవడం కష్టంగా మారింది. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) సీఎం జగన్(CM Jagan) గురించి మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెల్లూరులో సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జానీ మీడియాతో మాట్లాడుతూ అంగన్‌వాడి కార్యకర్తల డిమాండ్‌లో న్యాయం ఉందని.. వారి డిమాండ్‌ను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. తాను కూడా గతంలో అంగన్వాడి కేంద్రానికి వెళ్లిన వాడినేనని.. వారి కష్టం తనకు తెలుసని చెప్పారు.
తాను నెల్లూరుకు చెందిన వాడిని.. ఇక్కడి అంగన్‌వాడి కేంద్రంలో తిన్నవాడిని.. చదివిన వాడిని.. అని గుర్తుచేసుకున్నారు. ఇంత మంది అమ్మలు, చెల్లెళ్లు రోడ్డుపైకి వచ్చి ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. అందుకే తన వల్ల ఏమైనా అవుతుందేమో తన మాట సాయం వాళ్లకు పనికొస్తుందేమో అని ఇక్కడికి వచ్చానని వివరించారు. అనంతరం 2024 ఎన్నికల్లో జానీ మాస్టర్ పోటీ చేస్తారా? అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా.. ‘తెలీదు సార్. నుదుటి మీద ఎలా రాసుంటే అలా జరుగుతుంది’ అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? అని అడగగా.. మద్దతు గురించి నేను ఇంకా ఏమీ అనుకోలేదు.. దాని గురించి తర్వాత మాట్లాడతానని అన్నారు.
అలాగే మీరు జనసేన పార్టీ తరఫున ఇక్కడికి వచ్చారని అందరూ అంటున్నారు.. మీరేమంటారు? అని ప్రశ్నించగా.. ‘నేను మళ్లీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోంటి. రామ్‌గోపాల్ వర్మ(Ramgopal Varma) గారికి పవన్ కళ్యాణ్(PawanKalyan) గారు అంటే ఎంత ఇష్టమో జానీ మాస్టర్‌కి జగన్ గారంటే అంత ఇష్టం వెల్లడించారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తల పోరాటంలో మరణించిన నెల్లూరు జిల్లా సంగం మండలంలోని తరుణవాయి గ్రామానికి చెందిన రమణమ్మకు రూ. 70 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జానీతో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొనడం గమనార్హం.
కాగా పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయినా జానీ మాస్టర్ జగన్ అంటే చాలా ఇష్టమని చెప్పడం సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. రామ్‌గోపాల్ వర్మ కూడా పవన్ కల్యాణ్ అంటే తన ఇష్టమని పలు మార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయినా కానీ పవన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంటారు. అలాగే జానీ మాస్టర్ కూడా తనకు జగన్ అంటే అభిమానం అని చెప్పడం చూస్తుంటే పరోక్షంగా ఆయన మీద ఆర్జీవీ లాగా సెటైర్లు వేశారంటున్నారు. అంగన్‌వాడీలకు మద్దతు ఇచ్చే కార్యక్రమంలో జానీ మాస్టర్‌తో పాటు జనసేన నాయకులు కూడా పాల్గొనడంతో త్వరలోనే జనసేన పార్టీలో చేరడం ఖాయమని చర్చించుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com