ఛాలెంజింగ్ పాత్రలు అంటే నాకు ఇష్టం.. రాహు హీరో అభిరామ్ వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా విడుదలకు ముందే ఇండస్ట్రీలో మంచి టాక్ ను సొంతం చేసుకున్న రాహుల్ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా మీడియా తో ముచ్చటించారు హీరో అభిరామ్ వర్మ...
" మను సినిమా లో నా నటన నచ్చి దర్శకుడు సుబ్బు గారు ఆడిషన్స్ కి పిలిచారు. దర్శకుడు సుబ్బు కూడా నాలాగే యుఎస్ నుండి సినిమా మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చారు. ఆయన టెక్నీకల్ సైడ్ చాలా స్ట్రాంగ్ ఉంటారు. అందుకే రాహు కొత్త దర్శకుడి సినిమా లా అనిపించదు. కృతి గార్గే, కాలకేయ ప్రభాకర్ ల పాత్రలు చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి ఈ సినిమా లో లవర్ బాయ్ లా మొదలైన నా పాత్ర యాక్షన్ కి టర్న్ అవుతుంది. ఈ పాత్ర లో చాలా వెరీయేషన్స్ ఉన్నాయి. అందుకోసం నేను బాగా ప్రిపేర్ అయ్యాను. ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ. కృతి పాత్ర లో చాలా సవాళ్లు ఉన్నాయి.
కన్వర్షన్ డిజార్డర్ తో బాధ పడే అమ్మాయి తన జీవితంలో కి వచ్చిన రాహు తో ఎలా ఫైట్ చేస్తుంది అనేది చాలా ఆసక్తి గా మలిచారు దర్శకుడు సుబ్బు గారు. చాలా మంది అనుకున్నట్లు ఇది జాతకాలు సినిమా కాదు. కథ కు రాహు టైటిల్ బాగా సరిపోతుంది సినిమా చూసాక మీకు అర్ధం అవుతుంది. సినిమా చూసి జీ తెలుగు వాళ్ళు శాటిలైట్, డిజిటల్ హక్కులను తీసుకోవడం మా నమ్మకానికి బలం చేకూర్చింది.
యు యస్ లో ఫిలిమ్స్ లో మాస్టర్స్ చేసాను. మిస్టర్ ఆంధ్రా గా సెలెక్ట్ అయ్యాను..మిస్టర్ ఇండియా ట్రయల్స్ లో ఉండగా దర్శకుడు తేజ గారి నుండి 'హోరా హోరీ' కోసం కాల్ వచ్చింది తర్వాత మను, ఇప్పుడు రాహు ప్రతి పాత్ర కూడా ఛాలెంజింగ్ ఉండాలని కోరుకుంటాను. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. రాహు చూసిన వారంతా నా నటన గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. కొన్ని కథలున్నాయి వాటిని వెబ్ సిరీస్ చేద్దామనుకుంటున్నాను" అంటూ ముగించారు
న్యూ ఎజ్ థ్రిలర్ గా ఈ నెల 28న గ్రాండ్ గా రీలీజ్ కాబోతున్న రాహు చిత్రంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments