ఎవరితో సినిమా తీయాలో నాకు తెలుసు.. ఎందుకు ఫాలో అవుతున్నావ్!
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఆర్ఎక్స్ 100’ లాంటి బుల్లెట్ లాంటి సినిమాను గురి తప్పకుండా షూట్ చేసి.. టాలీవుడ్‌లో సింగిల్ సినిమాతో తన సత్తా చాటి చూపించిన దర్శకుడు అజయ్ భూపతి. ఈయన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కావడం మరో విశేషం. కాగా ఇండస్ట్రీలో చాలా మంది ఆర్జీవీకి శిష్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ సినిమాతో రికార్డ్ సృష్టించిన అజయ్.. తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారు..? ఏ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నారు..? అసలు ఆయన సినిమాలో హీరో ఎవరు..? హీరోయిన్ ఎవరు..? ఈ సినిమాకు ఎవరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..? అనేవి గత కొన్ని రోజులుగా వస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్నలు. అయితే అత్యుత్సాహంతో కొన్ని వెబ్‌సైట్లు ఏవేవో రాసేస్తున్నాయి. అయితే మరో అడుగు ముందుకేసిన వెబ్ సైట్స్ అత్యుత్సాహంతో నాగచైతన్యను-సమంతను జోడికట్టి మరీ వార్తలు రాసేసారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన అజయ్ భూపతి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
ట్వీట్ సారాంశం ఇదీ..
"నా రెండో సినిమా ఎప్పుడు..? ఎవరితో ఎలా తీయాలో నాకు తెలుసు. దయచేసి పుకార్లు ఆపండి" అని అజయ్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు పలువురు అభిమానులు, హీరో కార్తికేయ అభిమానులు పెద్ద ఎత్తున రియాక్టవుతున్నారు. కొందరు పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు దుమారం రేపే కామెంట్స్‌తో హడావుడి చేశారు.
నన్నెందుకు ఫాలో అవుతున్నావ్!
అజయ్ ట్వీట్‌కు ఓ నెటిజన్ ఒకింత వివాదాస్పదంగా స్పందించాడు. "నువ్ పెద్ద రాజమౌళి మరి.. ఇంకా ఇండస్ట్రీలో నీ పేరు ఎవరికీ తెలియదు" అని కామెంట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు అజయ్ ఘాటుగా స్పందించారు. "నన్ను నువ్వెందుకు ఫాలో అవుతున్నావ్ మరి.." అంటూ గట్టిగా కౌంటరిచ్చారు.
మీరైనా చెప్పొచ్చు కదా బ్రో..!
అయితే.. ఆ నెటిజన్ మళ్లీ స్పందిస్తూ.." నేను మీ మంచి కోసం చెబుతున్నాను సార్.. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ట్వీట్ వేయడం రూమర్స్‌ను కేర్ చేస్తే పెద్ద పెద్ద మూవీస్ ఎలా తీస్తారు. ఇలాంటివన్నీ వదిలేయండి.. యాక్టర్ కార్తికేయ అన్న మీరైనా చెప్పొచ్చు కదా బ్రో" అంటూ మరో కామెంట్ చేశాడు. ఇలా నెటిజన్‌కు డైరెక్టర్‌కు మధ్య ఒకింత ట్వీట్ వార్ జరిగింది. కాగా ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు స్పందించారు.
Naa rendo cinema eppudu,evaritho,elaa teeyalo naaku telusu
— Ajay Bhupathi (@DirAjayBhupathi) April 30, 2019
Plz stop the rumors
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments