close
Choose your channels

అది నాకే తెలుసు.. అందుకే నా బయోపిక్‌లో నేనే హీరో: సోనూసూద్

Saturday, July 18, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అది నాకే తెలుసు.. అందుకే నా బయోపిక్‌లో నేనే హీరో: సోనూసూద్

ఎవరి బయోపిక్‌లో వారే నటిస్తే.. ఆలోచనే వినూత్నంగా ఉంది కదా.. ఇప్పటి వరకూ ఎవరి బయోపిక్‌లో వారే నటించిన దాఖలాలైలతే దాదాపు లేవనే చెప్పాలి. కానీ రీల్ లైఫ్ విలన్.. రియల్ లైఫ్ హీరో సోనూ సూద్ మాత్రం.. తన బయోపిక్‌లో తనే నటిస్తానంటున్నాడు. కరోనా కష్టకాలంలో దాదాపు హీరోలంతా ఇంటికి పరిమితమై.. వంట చేసుకునే చాలెంజ్.. ఆ చాలెంజ్.. ఈ చాలెంజ్ అంటూ ఎవ్వరికీ ఉపయోగపడని చాలెంజ్‌లు విసురుకుని వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రీల్ లైఫ్ విలన్ మాత్రం రియల్ లైఫ్ హీరోగా మారిపోయాడు.

తన సొంత ఖర్చులతో వలస కూలీలను సకల సౌకర్యాలతో వారి వారి స్వగ్రామాలకు పంపించాడు. అంతటితో ఆగాడా? తన హోటల్‌ నుంచి భోజనం వండించి ప్రతిరోజూ ఎందరికో ఆకలి తీర్చాడు. సోనూ సేవలను చూసి దేశమంతా హర్షించింది. ప్రభుత్వాలు సైతం సోనూని ప్రశంసలతో ముంచెత్తాయి. సోనూకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సోనూ బయోపిక్‌ను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని సోనూని అడిగితే.. తన బయోపిక్ నిజంగా తీస్తే.. దానిలో తన పాత్రను తానే పోషిస్తానని చెప్పాడు. దీనికి కారణం కూడా వివరించాడు... తన జీవితంలో తాను ఎదుర్కొన్న సంఘర్షణలు, సమస్యలు తనకంటే ఎక్కువ ఎవరికీ తెలియవు కదా.. అందుకే తన క్యారెక్టర్‌లో తనే జీవిస్తానని సోనూసూద్ బదులిచ్చాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment