'అన్నపూర్ణమ్మ గారి మనవడు'తో మళ్ళీ అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా - బాలాదిత్య
Send us your feedback to audioarticles@vaarta.com
నా పాత్ర నిడివి తక్కువైనా సినిమా మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. అన్నారు బాలాదిత్య. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రధారి. నర్రా శివనాగేశ్వరరావు దర్శకుడు. మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలో నటించాడు. యం.ఎన్. అర్ చౌదరి నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో బాలాదిత్య ఇంటర్వ్యూ..
‘తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృతల ప్రేమకథ స్ఫూర్తితో దర్శకుడు మా పాత్రల్ని తీర్చిదిద్దారు. నాకు జంటగా అర్చన నటించింది. అమృత తండ్రి మారుతిరావుగా బెనర్జి నటించారు. మిర్యాలగూడలో జరిగిన సంఘటనని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు. ఆయన ఎందరో ప్రముఖ హీరోలతో విజయవంతమైన సినిమాలు తెరకెక్కించారు. నర్రా శివనాగేశ్వరరావు అనుభవం ఈ సినిమాకి ఎంతో ఉపయోగపడింది. ద్వితీయార్ధంలో నా పాత్ర కనిపిస్తుంది. నా పాత్ర నిడివి తక్కువైనా సినిమా మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్ర చేసే ముందు ప్రణయ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నా. అందులో కొత్త విషయాలున్నాయి. చాలా కాలం తర్వాత మళ్లీ ఒక మంచి పాత్ర ఇచ్చిన నర్రా శివనాగేశ్వరరావు గారికి ఈ సందర్భంగా దన్యవాదాలు తెలియజేస్తున్నా. అర్చన. బెనర్జి కూడా చక్కగా నటించారు. ఈ పాత్ర ద్వారా నాకు మళ్ళీ అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.
‘‘నేను చేసిన ‘1940లో ఒక గ్రామం’ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. ఇన్నాళ్లకు ఈ చిత్రంతో ఓ మంచి పాత్ర దొరికింది. దీనికి ముందు ‘ఎంత మంచివాడవురా’లోనూ ఓ చక్కటి పాత్ర చేశా. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈటీవీలో వచ్చే ఛాంపియన్ కార్యక్రమంతోనే మళ్లీ ప్రేక్షకులకు చేరువయ్యా. తమిళంలో ‘రాసాతి’ అనే సీరియల్ చేస్తున్నా. దానికి మంచి ఆదరణ లభిస్తోంది అలాగే తెలుగులో ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ అనే వెబ్‌సిరీస్ చేశా’’.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout