ఆ అకౌంట్కు.. నాకు ఎలాంటి సంబంధం లేదు : రావు రమేష్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో సీట్లు సంపాదించుకుని.. అఖండ విజయంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు జగన్ ఏడాది పాలనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కొందరు విమర్శల వర్షం కురిపిస్తుండగా.. వైసీపీ నేతలు, కార్యకర్తలు.. మరోవైపు కొందరు నెటిజన్లు సైతం మెచ్చుకుంటూ ట్వి్ట్టర్లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అయితే కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి ఎవరెవరో పేరటి సోషల్ మీడియాలో ఖాతాలు ఓపెన్ చేసి ఇష్టానుసారం పోస్ట్లు చేసేస్తున్నారు.
ఇదీ ఆయన ట్వీట్..!
ఇక అసలు విషయానికి వస్తే.. టాలీవుడ్ ప్రముఖ నటుడు రావు రమేష్ పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ఓ ఆగంతకుడు టీడీపీకి సపోర్టుగా.. వైసీపీని తిట్టిపోస్తూ ట్వీట్స్ చేయడం ప్రారంభించాడు. మే నెలలో అకౌంట్ చేసి అన్నీ టీడీపీకి సపోర్టుగా ఉన్న ట్వీట్స్ చేయడం.. రీ ట్వీట్స్ చేయడం ప్రారంభించాడు. అలా ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్పై కూడా విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశాడు. ‘మొదటి విధ్వంసం! చాలా బాధపడ్డ మన ఆంధ్ర ప్రదేశ్ ఎటు వెళ్తుందో అని.. ఇప్పటికైనా మారతారని ఆశిస్తూ- మీ రావు రమేష్’ అని ఆయన పేరుతో ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ చూసిన చాలా మంది నెటిజన్లు, టీడీపీ కార్యకర్తలు.. ఆయన మనోడే అంటూ కామెంట్స్ చేయగా.. వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు మాత్రం దుమ్మెత్తి పోశారు. దీంతో ఈ వ్యవహారం ఎట్టకేలకు రమేష్ చెవిన పడటంతో అలెర్ట్ అయిన ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
నాకు ఎలాంటి అకౌంట్స్ లేవ్..
‘మీడియా మిత్రులకు, నన్ను.. నా నటనను అభిమానించే ప్రతి ఒక్కరికీ.. నాకు ఏ సోషల్ మీడియాలో ఏటువంటి అకౌంట్స్ లేవు. ఫేస్బుక్ గానీ, ట్విట్టర్ గానీ, ఇన్స్ట్రా గ్రామ్ ఇలా ఏమి లేవు. ఈ రోజు నా పేరు మీద ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులకు గానీ, ఆ అకౌంట్కు గానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి వాటిని నమ్మకండి. ఏమైనా ఉంటే పత్రికా ముఖంగా నేనే తెలియజేస్తాను. త్వరలోనే నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టబోతున్నాను’ అని రావు రమేష్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కాగా ఇలా సెలబ్రిటీలను ఆగంతులు ఇబ్బంది పెట్టడం ఇవాళ కొత్తేమీ కాదు. ఇలాంటి వ్యవహారాలు చేస్తున్న దుండగులకు ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments