మూడు రోజులుగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నా: కాజల్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ గ్లామర్ చందమామ కాజల్ అగర్వాల్ మూడు రోజులుగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నానని అంటూ ట్వీట్ చేసింది. అదేంటి? కాజల్ అగర్వాల్ ఆల్కహాల్ తీసుకుంటుందా? మూడు రోజుల నుండి మరీ ఎక్కువగా ఎక్కువగా తాగుతుందా? అనే సందేహం రాకమానదు. తాజాగా కాజల్ అగర్వాల్ చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అసలు కాజల్ ఈ ట్వీట్ ఎందుకు చేసిందబ్బా అనే విషయాన్ని చూస్తే.. ప్రపంచంలో అందరూ ఇప్పుడు కరోనా వైరస్ గురించి భయపడుతున్నారు. ఇటీవల అందరూ ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండే శానిటైజర్స్ వాడుతున్న విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని తెలియజేస్తూ కాజల్ సెటైరికట్‌గా ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు నేను తీసుకున్న ఆల్కహాల్ కంటే గత మూడురోజులుగా నేను ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నానంటూ కాజల్ ట్విట్టర్‌లో పెట్టిన మెసేజ్ బాగానే వైరల్ అవుతుంది. అలాగే రీసెంట్‌గా కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇప్పుడేం చేస్తే మంచిదని ఓ స్టాక్ బ్రోకర్‌ని అడిగితే దైవ నామస్మరణ చేయమని చెప్పాడంటూ కూడా కాజల్ సెటైరికల్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్.. ఇండియన్ 2లో 85 బామ్మ పాత్రలో నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com