ఐ హేట్ పవన్ ఫ్యాన్స్ అంటున్న వర్మ..

  • IndiaGlitz, [Thursday,March 17 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ ఏదో రకంగా వార్త‌ల్లో ఉంటుంటారు. వంగ‌వీటి రంగా పై సినిమా తీస్తున్నాన‌ని సంచ‌ల‌నం సృష్టించిన వ‌ర్మ...ఈ సినిమా కో్సం బెజ‌వాడ వెళ్లి మ‌రోసారి సెన్సేష‌న్ క్రియేట్ చేసారు. ఇదిలా ఉంటే..తాజాగా వ‌ర్మ ట్విట్ట‌ర్ లో...ఐ ల‌వ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అండ్ గాడ్. కాక‌పోతే దేవుడ్ని - ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ప్రేమింస్తుండ‌డానికి వేరే కార‌ణాలు ఉన్నాయి. కానీ...భ‌క్తుల‌ను, ప‌వ‌న్ ఫ్యాన్స్ ని ఒకే కార‌ణంతో వ్య‌తిరేకిస్తున్నాని చెప్పారు. ఇటీవ‌ల.. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం రియ‌ల్ మెగాప‌వ‌ర్ స్టార్ అని....స్ర్కిన్ మెగాప‌వర్ స్టార్ జ‌స్ట్ ఆర్డిన‌రీ ఫేక్ ఏక్ట‌ర్స్ అని ట్విట్ చేసిన వ‌ర్మ ఇప్పుడు స‌డ‌న్ గా ఐ ల‌వ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ ట్వీట్ చేయ‌డం ఏమిటో..వ‌ర్మ‌కే తెలియాలి.