తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ అంటే ఏమిటో తెలిసింది అంటున్న నిర్మాత
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిక్క. ఈ చిత్రాన్ని నూతన నిర్మాత రొహిన్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఆగష్టులో తిక్క ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత రొహిన్ కుమార్ రెడ్డి మీడియాతో తన తొలి చిత్రం అనుభవాలను పంచుకున్నారు. నిర్మాతగా ఫస్ట్ మూవీ కదా...ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ సహకరిస్తారో లేదో అనుకున్నాను కానీ...అందరూ సహకరించారు అని తెలియచేసారు.
అయితే...బాలీవుడ్ లో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ టైమ్ అంటే టైమ్ కి సెట్ కి వస్తారు. కానీ...టాలీవుడ్ లో పరిస్ధితి అలా లేదు. అలాగే కొంత మంది ఆర్టిస్టులు బ్రేక్ ఫాస్ట్ లో ఇది కావాలి..లంచ్ ఇలా ఉండాలి..అంటూ రకరకాల ఆర్డర్స్ ఇస్తుంటారు. జేమ్స్ కెమెరాన్ అవతార్ సినిమాకి రెండు సంవత్సరాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి...దాదాపు ఓ యాభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేసారు. అదే మా సినిమాకి దాదాపు వంద రోజులు షూటింగ్ చేసాం. ఇది టాలీవుడ్ లో పరిస్థితి. అందుచేత మన ఇండస్ట్రీలో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్ లో ఖచ్చితంగా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను అంటూ తన అనుభవాలను పంచుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments