శేష్ సూపర్బ్.. నేను హ్యాపీ.. ‘ఎవరు’లో ఛాన్స్ రావడానికి..!
Send us your feedback to audioarticles@vaarta.com
‘క్షణం’, ‘గూఢచారి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్, రెజీనా నటీనటులుగా వెంకట్ రామ్‌జీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఎవరు’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్స్ సూపర్బ్ అనిపించాయి. పంద్రాగస్టు నాడు ప్రేక్షకుల ముందు ఈ సినిమా రానుంది. సింగిల్ ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో జనాలకు బాగా అర్థమైపోయింది. దీంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఒక మర్డరీ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సస్పెన్స్.. సస్పెన్.. అంతా కథ ఇలానే సాగింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రెజీనా కాసాండ్రా సినిమాకు, తన ప్యూచర్ ప్రాజెక్ట్స్, అడవి శేష్ నటన గురించి పలు ఆసక్తికర విశేషాలు మీడియాతో ముచ్చటించింది.
‘ఎవరు’ లో ఛాన్స్ ఎలా వచ్చింది.. పాత్రేంటి!?
‘నిర్మాత పీవీపీగారు నాకు కాల్ చేసి.. వెంకట్ రామ్‌జీ అనే కొత్త దర్శకుడు కథ చెబుతారు. వినండి.. మీకు నచ్చితే చేద్దాం అన్నారు. డైరెక్టర్ వచ్చి నాకు కథ చెప్పారు. చాలా బాగా నచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఈ సినిమాలో నేను సమీరా అనే పాత్రలో కనిపిస్తాను. సమీరా ముఖంలో పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ కనబడవు. వెంకట్ రామ్‌జీ నన్ను దృష్టిలో పెట్టుకునే ప్రత్యేకంగా పాత్రలు రాశారు. ఈ పాత్రలో నటించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. నా కెరీర్‌లో మంచి క్యారెక్టర్స్‌లోనే యాక్ట్ చేశాను. కానీ ఈ సమీరా రోల్ పూర్తి సంతృప్తినిచ్చింది. సమీరా అనే అమ్మాయి లైఫ్‌లో ఓ ఇన్సిడెంట్ జరుగుతుంది. అయితే ఆ ఇన్సిడెంట్ ఏమిటి..? ఆ ఇన్సిడెంట్‌పై ఎలాంటి విచారణ జరిగింది..? చివరికీ సమీరా లైఫ్ ఎలాంటి మలుపు తిరుగుతుంది..? లాంటి థ్రిల్లింగ్ సినిమాలోని అంశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి.
నేను హ్యాపీ.. అడవి శేష్ సూపర్బ్!
నేను ఇండస్ట్రీకి వచ్చి ఏడు సంవత్సరాలైంది. నా కెరీర్‌లో చాలా హ్యాపీగా ఉన్నాను. నా దగ్గరికొచ్చి కథల్లో పాత్ర నచ్చితే కచ్చితంగా చేస్తాను.. చేస్తాను. ఇక పెద్ద సినిమాలు చెయ్యలేకపోవటానికి కారణమేంటో నాకూ తెలియట్లేదు. నేను నటించిన సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అలాగే ‘అడివి శేష్’ అమేజింగ్ అండి.. మంచి యాక్టర్.. ఆయనతో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చేస్తున్నంత సేపూ ఫుల్‌గా ఎంజాయ్ చేశాను" అని రెజీనా చెప్పుకొచ్చింది. పంద్రాగస్టు నాడు వస్తున్న ‘ఎవరు’ ఏ మాత్రం సక్సెస్ అవుతుందో వేచిచూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout