నాకు కాంపిటిషన్ ఎవరో 15 ఏళ్ల తర్వాత అర్థమైంది - రామ్
Send us your feedback to audioarticles@vaarta.com
``దేవదాసు’ సినిమాతో 15 ఏళ్ల క్రితం సంక్రాంతి సీజన్లో థియేటర్లలోకి వచ్చాను. మళ్లీ ఇప్పుడు ‘రెడ్’ రిలీజయింది. నాకు సిసలైన కాంపిటిషన్ ఎవరన్నది 15 ఏళ్ల తర్వాత అర్థమైంది. నేను ప్రేక్షకుల మీద చూపించే అభిమానం, అభిమానులు నా మీద చూపించే అభిమానం ఎప్పుడూ పోటీపడుతూనే ఉంటాయి. ఇంతకు మించిన కాంపిటిషన్ ఇంకేం ఉంటుంది?`` అని హీరో రామ్ పోతినేని అన్నారు. ‘రెడ్ ‘ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ విశాఖపట్టణంలోని గురజాడ కళాక్షేత్రంలో శనివారం రాత్రి జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
రామ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రెడ్’. సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. శ్రీ స్రవంతి మూవీస్ నిర్మించిన చిత్రమిది. స్రవంతి రవికిశోర్ నిర్మాత. కృష్ణ పోతినేని సమర్పించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు.
విశాఖపట్టణంలో జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో....
హీరో రామ్ మాట్లాడుతూ `` మేం చాలా ట్విస్టులతో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీసాం. కానీ సినిమా లో ఉన్న ట్విస్టులకన్నా సినిమా విడుదల తరువాత ఒక పెద్ద ట్విస్ట్ ని ఎక్స్ పీరియన్స్ చేశాం. నిజానికి సినిమా రిలీజ్ టైమ్‌లో ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిజీవ్ చేసుకుంటారు? వారి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అని ఈగర్‌గా వెయిట్ చేశాం. మార్నింగ్ షో కి వచ్చిన అభిప్రాయాలన్నీ సాయంత్రానికి మారిపోయాయి. ప్రతి షో పూర్తయిన తర్వాత మరుసటి షోకి కలెక్షన్లు అంతకంతకూ పెరగసాగాయి. మా సస్పెన్స్ థ్రిల్లర్ ని థ్రిల్లింగ్ హిట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కి మేము అందరం చాలా కష్టపడ్డాం. ప్రతి సన్నివేశాన్నీ ఇష్టపడి చేసాం. మా ప్రయత్నాన్ని అందరూ ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని అద్భుతంగా రాసిన కిషోర్ తిరుమల గారికి ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ తో మూల స్తంభంలా నిలుచున్నారు మణిశర్మ గారు. ఆయనతో ఇస్మార్ట్ శంకర్ తరువాత ఇది మరో హిట్ కంబినేషన్. మా కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది. మాళవికను అందరూ టాలీవుడ్ కి కొత్త క్రష్ అని పిలుస్తున్నారు . తను చాలా అద్భుతంగా చేసిందీ చిత్రంలో. 15 సంవత్సరాల ముందు ఇదే సంక్రాంతికి దేవదాస్ సినిమా తో వచ్చా . పరిశ్రమలో ఇప్పటికీ చాలా మంది మీకు కాంపిటీషన్ ఎవరు అని అడుగుతుంటారు. 15 సంవత్సరాల తరువాత నా కాంపిటీషన్ ఎవరనే విషయం అర్థం అయింది. అభిమానులుగా మీరు చూపించే ప్రేమ ఎక్కువా, నేను మీకు చూపించే ప్రేమ ఎక్కువా అన్నదాంట్లోనే మనకి పోటీ నడుస్తోంది" అన్నారు.
హీరోయిన్ మాళవిక శర్మ మాట్లాడుతూ, “ఈ సినిమా ని ఇలా ఒక హిట్ చిత్రంలా మలచడానికి కష్టపడ్డ ప్రతి డిపార్ట్మెంట్లోని, ప్రతి సభ్యుడికీ నా అభినందనలు. అభిమానులందరికి కూడా చాలా ధన్యవాదాలు. స్రవంతి మూవీస్ లో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది, మళ్ళీ మళ్ళీ ఈ టీమ్‌తో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను. కిషోర్ సర్ మూలంగా ప్రజలు నన్ను మహిమా(చిత్రంలో ఆమె పేరు) అనే పేరుతో పిలవడం ప్రారంభించారు, అలాంటి మంచి రోల్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.ఈ చిత్రం చూసాక రామ్‌కి పెద్ద అభిమానిని అయిపోయాను, ఆయన వేరే లెవల్ లో పెర్ఫార్మ్ చేశారు. ఆయనకు పూర్తిగా అభిమానిని అయిపోయా. ఈ హిట్ చిత్రంలో నన్ను కూడా భాగం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ని చూడని వారు తప్పకుండా చూడండి " అని అన్నారు.
డైరెక్టర్ కిశోర్ తిరుమల మాట్లాడుతూ, " మా సినిమా ని ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకి హృదయపూర్వక ధన్యవాదాలు. వైజాగ్ కీ... నాకూ ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది, వైజాగ్ లో నేను మూడు సినిమాలు చేశాను. సినిమా షూటింగ్ కి మాత్రమే కాదు, స్క్రిప్ట్ పని కి కూడా నేను వైజాగ్ కే వస్తాను. ఎందుకంటే సినిమాకి సహాయపడిన చాలా మంచి మాటలన్నీ ఇక్కడ పుట్టినవే, ఇక్కడ సముద్రం ముందు కూర్చొని రాసినవే. రెడ్ ఈ రోజు ఇంత సక్సెస్ అయ్యింది అంటే అతి ముఖ్యకారణం రామ్ గారే. ఆయన చేసిన మాస్ క్యారెక్టర్ ని థియేటర్ లో జనాలు ఎంజాయ్ చేస్తున్నతీరు అసలు మాటల్లో చెప్పలేను. చాలా సంతోషంగా ఉంది. మా చిత్రాన్ని మీ ఫ్యామిలీ తో కలిసొచ్చి చూడండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది" అన్నారు.
వేడుకలో భాగంగా హీరో రామ్‌ని ఫ్యాన్స్ కొన్ని ప్రశ్నలడిగారు. ఫ్యాన్స్ ప్రశ్నలు... రామ్ సమాధానాలు..!
ఫ్యాన్స్: మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు?
రామ్: జరగాల్సిన సమయంలో అది జరుగుతుంది. మనచేతుల్లో ఉండదు.
ఫ్యాన్స్: మీరు రెండు పాత్రల్లో అద్భుతంగా నటించారు. అలాగే దశవతారంలో నటన విశ్వరూపం ఎప్పుడు చూపిస్తారు?
రామ్: అలాంటి కథ దొరికితే కచ్చితంగా త్వరలోనే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com