4వ తరగతిలోనే ప్రేమలో పడ్డాను: నిధి అగర్వాల్

  • IndiaGlitz, [Monday,July 06 2020]

4వ తరగతిలోనే ప్రేమలో పడ్డాను: నిధి అగర్వాల్ నాలుగవ తరగతిలోనే.. ప్రేమలో పడ్డానని నిధి అగర్వాల్ వెల్లడించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దీనిలో భాగంగా తన ప్రేమ, బ్రేకప్ తదితర విషయాలను వెల్లడించింది. తాను నాలుగవ తరగతిలోనే ప్రేమలో పడ్డానని నిధి వెల్లడించింది. కొంచెం పెద్దయ్యాక ఒక అబ్బాయితో డేటింగ్‌కి వెళ్లానని తెలిపింది.

ఆ వ్యక్తి నుంచే తాను తొలి లవ్ ప్రపోజల్ అందుకున్నానని ముద్దుగుమ్మ వెల్లడించింది. కాగా.. ఒకే ఒక్కసారి మాత్రం అమ్మడికి తీవ్ర స్థాయిలో హార్ట్ బ్రేక్ అయిందట.. అది ఎవరి కారణంగా అన్నది మాత్రం చెప్పనని స్పష్టం చేసింది. ఇక హీరోల్లో నా ఫస్ట్ క్రష్ మాత్రం షారుఖ్ ఖాన్ అని.. ప్రేమించే వ్యక్తి విషయంలో మాత్రం పెద్దగా కోరికలు లేవని నిధి అగర్వాల్ వెల్లడించింది.