‘చెక్’ సినిమాను థియేటర్లో చూడాలనే ఫీలింగ్ కలిగింది..ఈ సినిమా క్లాస్,మాస్ హద్దులను చెరిపేస్తుంది: ఎస్ఎస్ రాజమౌళి
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్ స్టార్ నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో, హీరోయిన్లుగాఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్యక్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత వీ ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్. ఈ చిత్రం ఫిబ్రవరి 26 తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఫిబ్రవరి 21వ తేదీన(ఆదివారం) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్రదర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగాహాజరయ్యారు.
ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. .''ఈ సినిమాలో ఉన్న ఒక్క పాటను విన్నాను. కల్యాణీ మాలిక్ అద్భుతంగా చేశారు. ఒక్క పాట ఈ సినిమాను మరో లెవెల్‌కుతీసుకెళ్తుంది. చంద్రశేఖర్ యేలేటికు ఇది తొలి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకొంటాను. అందుకే చాలా టెన్షన్‌తో ఉన్నారు. ఇక నేను చాలా రోజులు తర్వాత థియేటర్‌కు వెళ్లి చూడాలని ఫీలైన చిత్రం చెక్. ఈ సినిమా కాన్సెప్ట్ అలాంటిది. ఇంట్రెస్టింగ్ థీమ్ థియేటర్‌కు వెళ్లి చూడాలనిపించేలా చేసింది. చెక్ సినిమాలో చెస్ కథను నేపథ్యంగా తీసుకోవడం, సినిమా అంతా జైలులోనే తీయడం ఇంట్రెస్ట్ కలిగించింది. చెక్ సినిమా క్లాస్, మాస్ అనేహద్దులను చెరిపివేస్తుంది. వైవిధ్యమైన ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని బలంగా నమ్ముతున్నాను. నితిన్ విషయానికి వస్తే ఒకే రకమైన సినిమాల్లో నటిస్తారనే వాదనను మరిపిస్తూ చాలా కష్టపడి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడుఎలాంటి సినిమాల్లోనైనా నటిస్తారనే పేరు తెచ్చుకొన్నారు. చెక్ సినిమాతో మరోసారి నితిన్ పెర్ఫార్మెన్స్ పరంగా నిరూపించుకొంటారని అనుకొంటున్నాను. ఫిబ్రవరి 26న విడుదలయ్యే చెక్ సినిమా ఎదురు చూస్తున్నాను'' అని అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ..'' ఎప్పుడూ రాజమౌళి గురించి మాట్లాడే అవకాశం రాలేదు. ఆయనతో చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా వేదికను పంచుకోవడం ఆనందంగా ఉంది. స్కూల్ టైమ్ నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. గొప్పగా కలలు కనాలని మీరుఅందరికీ నేర్పించారు. ఎవరైనా పెళ్లి తర్వాత స్లో అవుతారు. నితిన్ మాత్రం స్పీడ్పెంచారు. నాలుగైదు సినిమాలు ప్రకటించాడు . రెండేళ్ల క్రితం నితిన్ నాకు చెక్ సినిమా కథ చెప్పారు. మధ్యలో ఎప్పుడూ కలిసినా చెక్ సినిమాపై అదే ఫీలింగ్పెట్టుకొన్నాడు. చెక్‌పై మంచి నమ్మకం పెట్టుకున్నాడు . అందుకు తగినట్టే ఈ సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది. చంద్ర శేఖర్ యేలేటి సినిమాలంటే ప్రేక్షకుల్లో, యూత్‌లో మంచి కాన్పిడెన్స్ ఉంటుంది. ఆయన ఆలస్యంగా రేర్‌గా సినిమాలు తీస్తుంటారు . కానీ అవిప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. చెక్ సినిమా కూడా మీ కెరీర్లో పెద్ద బ్లాక్బస్టర్కావాలని కోరుకొంటున్నాను'' అని చెప్పారు .
హీరో నితిన్ మాట్లాడుతూ.. చెక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి, రమక్క (రమ రాజమౌళి)కు ధన్యవాదాలు. ఇక వరుణ్ తేజ్ నాకు ట్రూ ఫ్రెండ్. రాజమౌళి గారు తెలుగు సినిమాను ప్రపంచ పటంపై పెట్టారు. అలాంటి మీతో నేను మీరు రూపొందించిన ' సై' చిత్రంలో నటించే అవకాశం దక్కింది. నా కెరీర్లో గుర్తుంచుకొనే చిత్రంగా మిగిలింది . 'సై' చిత్రం కూడా రగ్బీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. ఇప్పుడు చెక్ సినిమా కూడా క్రీడా నేపథ్యం ఉన్నచిత్రం కావడం హ్యాపీగా ఉంది. చంద్రశేఖర్ యేలేటి లాంటి దర్శకుడితో చెక్ సినిమాచేయడం లక్కీగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు నా యాక్టింగ్ ఒక లెక్క.. చెక్ తర్వాత మరోలెక్క. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ 'చెక్' సినిమా షూటింగులో ఎన్నో టేకులుతీసుకొన్నాను. నాకు డిఫరెంట్ యాక్టింగ్‌ను చంద్ర శేఖర్ యేలేటి నేర్పించారు. కల్యాణీ మాలిక్ ఈచిత్రానికి బిగ్గెస్ట్ పిల్లర్. మేము 50 శాతం పనిచేస్తే మీరు మరో లెవెల్‌కు తీసుకెళ్లారు'' అనిఅన్నారు.
ప్రియా ప్రకాశ్ వారియర్ మాట్లాడుతూ.. చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం నాకు చాలాఆనందంగా ఉంది. హైదరాబాద్ నాకు రెండో ఇల్లుగా మారింది. తెలుగులో బెటర్ లాంచ్ జరిగిందని భావిస్తున్నాను. నితిన్ నాకు అమేజింగ్ కో స్టార్. నాపై ఎంతో నమ్మకంపెట్టుకొన్న నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారికి, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి నా ధన్య వాదాలు. చిన్నప్పటి నుంచి ఇలా హీరోయిన్గా ప్రేక్షకుల ముందు నిలబడాలన్నది నాడ్రీమ్. ఈ వేడుకకు వచ్చిన రాజమౌళి, వరుణ్ తేజ్‌కు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను'' అనిఅన్నారు.
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ.. ఈ సినిమావేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన వరుణ్ తేజ్, ఎస్ఎస్ రాజమౌళికి ధన్యవాదాలు. చివరి నిమిషంలో ఆహ్వానించినప్పటికి, ఆయన తన ముఖ్యమైన పనులను వదులుకొని ఈ వేడుక కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నితిన్ ఫ్యాన్స్‌కు ఒక్కటే చెప్పదలచుకొన్నాను. చెక్ సినిమా ఎవరినీ నిరాశ పరచదు. చెక్ సినిమా అందరూచూడాలని కోరుకొంటున్నాను'' అని అన్నారు.
ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ... చెక్ యూనిట్‌ను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అగ్రదర్శకులు ఎస్ఎస్ రాజమౌళికి, వరుణ్ తేజ్, గోపిచంద్ మలినేని, వెంకీ కుడుములకు ధన్య వాదాలు. కరోనా సమయంలో 2020 సంవత్సరంలో మేము ఓ పిట్టకథ, మిడిల్ క్లాస్మెలోడిస్ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి మంచి హిట్లను సాధించాం. ఇలాంటిరెండు విజయాల తర్వాత మేము చెక్ సినిమాతో ముందుకు వస్తున్నాం. నాకు ఇష్ట మైనడైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి, యూత్‌ఫుల్ హీరో నితిన్ కాంబినేషన్లో చెక్ మూవీనినిర్మించాం. ఇది మాకు గొప్ప కాంబినేషన్. నితిన్ ఎప్పటికీ గుర్తుంచుకొనే చిత్రంగా చెక్మిగిలిపోతుంది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్‌ను ఇంతకు ముందు చేయలేదు. లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న నితిన్ విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రంలో నటులు కాకుండా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అది మా డైరెక్టర్ గొప్పతనం. ఇక రకుల్ ప్రీత్‌సింగ్ లౌక్యం సినిమా తర్వాత మళ్లీ మా బ్యానర్ లో ఈ సినిమాలో నటించారు. లౌక్యం చిత్రం తర్వాత రకుల్ స్టార్ హీరోయిన్ అయింది. ఈ చిత్రం లో ప్రియా ప్రకాశ్ వారియర్ తొలిసారి మా బ్యానర్లో నటించారు. ప్రియా వారియర్‌కు కూడా మంచి భవిష్యత్ ఉండాలనికోరుకొంటున్నా. రకుల్ ప్రీత్ సింగ్, మిర్చి సంపత్ కాంబినేషన్ 'లౌక్యం' చిత్రంలో హిట్అయింది. మళ్లీ ఈ చిత్రంలో వారిద్దరు కలిసి నటించడం మాకు సెంటిమెంట్గామారుతుందని భావిస్తున్నాను'' అని నిర్మాత ఆనంద ప్రసాద్ అన్నారు.
దర్శకుడు గొపిచంద్ మలినేని మాట్లాడుతూ.. చెక్ మూవీ అతి పెద్ద హిట్ సాధిస్తుంది. ప్రేక్షకుల అభిరుచి మారింది. విభిన్నమైన సినిమాలను కోరుకొంటున్నారు. నితిన్ కెరీర్లోనే చెక్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది. చంద్రశేఖర్ యూనిక్ డైరెక్టర్. జెన్యూన్ డైరెక్టర్ . ట్రైలర్చూస్తే పెద్ద హిట్టు కొట్టబోతున్నట్టు అర్ధమైంది. కల్యాణీ మాలిక్ రీరికార్డింగ్ బాగుంటుంది. అభిరుచి కల నిర్మాత వీ ఆనంద్ ప్రసాద్. ఆయనకు మంచి హిట్ రావాలనికోరుకొంటున్నాను'' అని అన్నారు.
దర్శకుడు వెంకీ మాట్లాడుతూ.. ఈ రోజుతో మా భీష్మ రిలీజై ఏడాది అయ్యింది. ఇదేరోజు మళ్ళీ నితిన్ అన్న మరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండటం హ్యాపీగా ఉంది. ఈ సినిమా నాకు కూడా స్పెషల్ . ఎందుకంటే ఒకటి చంద్రశేఖర్ యేలేటి గారు, రెండు భవ్య క్రియేషన్స్ . మూడు నా డార్లింగ్ నితిన్ అన్న. నాకు ఇష్టమైన దర్శకుల్లో చంద్రశేఖర్యేలేటి ఒకరు. బయట ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగాసోషల్ మీడియాలో. 2007లో ఒక్కడున్నాడు సినిమా తీస్తే.. 2012లో మెల్ గిబ్సన్ (get the gringo) హాలీవుడ్ సినిమాను అదే పాయింట్ తో తెరకెక్కించారు. అలాంటి కథనుమీలాంటి దర్శకుడు ముందే తీసేశారు. నాకు గర్వంగా అనిపించింది. ఇక నితిన్గురించి చెప్పాలంటే .. కిందా పైనా ఊపు మా
నితిన్ అన్న తోపు. ఇది నేను సరదాగాచెప్పడం లేదు. నా మనసులో ఉన్నదే . ఎందుకంటే నాకు ఆయన ఎప్పుడూ తోపే. ఎవరైనా మన లైఫ్ లో మనల్ని నమ్మి మనకు సపోర్ట్ చేస్తే ఎల్లప్పుడు తోపే. ఇక టైగర్ కు టైమొచ్చింది అన్నట్లు 2020 నుంచి నితిన్ అన్న టైమ్ స్టార్ట్ అయ్యింది '' అని అన్నారు.
మిర్చి సంపత్ మాట్లాడుతూ.. నా కెరీర్లో ఎంతో మంది డైరెక్టర్లు, అసిసెంట్ డైరెక్టర్లతో పనిచేశాను. చంద్రశేఖర్ యేలేటి గురించి చాలా మంది వద్ద విన్నాను. ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో మంది అసిస్టెంట్డైరెక్టర్లకు ఆయన ఇన్స్పిరేషన్. చెక్
విషయానికి వస్తే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. నితిన్‌కు భీష్మ కంటే పెద్ద సక్సెస్ లభిస్తుంది. భవ్య క్రియేషన్స్ నాకు ఫ్యామిలీ ప్రొడక్షన్లాంటింది. నిర్మాత ఆనంద్ ప్రసాద్ చాలా సింపుల్‌గా ఉంటారు. లౌక్యం కంటే పెద్ద హిట్అవుతుంది'' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అన్నే రవి , ప్రముఖ పంపిణీ దారుడు వరంగల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout