అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు: సాయి తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
తన పెళ్లిపై వస్తున్న వార్తలపై సుప్రీం హీరో సాయి తేజ్ స్పందించాడు. తనకు అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదని స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులుగా సాయి తేజ్ పెళ్లి ఫిక్స్ అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో నిహారిక పెళ్లి తర్వాత జరగబోయేది సాయి తేజ్ పెళ్లేనంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. సాయితేజ్ది చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమవుతున్నాడని కొన్ని వార్తలొస్తే.. పెద్దలు కుదిర్చిన వివాహమేనంటూ కొన్ని వార్తలు వచ్చాయి. 2021లో సాయితేజ్ వివాహం చేసుకోబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది.
ఈ ప్రచారాలన్నింటికీ సాయి తేజ్ తాజాగా ఫుల్ స్టాప్ పెట్టాడు. అంత త్వరగా తనకు వివాహం చేసుకోవాలని లేదని స్పష్టం చేశాడు. తన కుటుంబ సభ్యులు తన కోసం వధువును వెదకాలని భావిస్తున్నారని.. దానికి మాత్రం తాను ఓకే చెప్పానని సాయితేజ్ వెల్లడించాడు. తన పెళ్లి విషయంలో మీడియా చూపిస్తున్న అత్యుత్సాహమే ఈ రూమర్స్ అన్నీటికీ కారణమని తెలిపాడు. ప్రస్తుతం సాయితేజ్ ‘సోలో బతుకే సో బెటర్’ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో దేవా కట్టా దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout