పవన్ తో సినిమా చేయనంటున్న వరుణ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా పరిచయమై...తాజాగా కంచె సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. కంచె సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నవరుణ్ తేజ్ ని...మెగా ఫ్యామిలీ హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేయాలంటే ఎవరితో చేస్తారని అడిగితే...పెదనాన్న చిరంజీవి గారితో చిన్నప్పుడు ఓ సినిమాలో నటించాను.
ఇక బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే భయం. ఆయనతో కలసి కెమెరా ముందు నటించడమే...అయ్య.. బాబోయ్. అది జరగదు. అందుచేత చరణ్ అన్నతో కలిసి నటిస్తా అంటున్నాడు. ఇటీవల చరణ్, వరుణ్ ఇద్దరు కలసి సినిమా చేద్దాం అనుకున్నారట. అలా...అనుకుంటే సరిపోదు కదా..కథ కుదరాలి. మరి..కథ ఎప్పుడు కుదురుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments