చిరంజీవి గారు అలా...ఎందుకు అన్నారో నాకు అర్ధం కాలేదు - అల్లు శిరీష్
Wednesday, August 3, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
గౌరవం చిత్రంతో హీరోగా పరిచయమై...కొత్త జంట సినిమాతో విజయం సాధించిన యువ హీరో అల్లు శిరీష్. తాజాగా అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పరుశురామ్ తెరకెక్కించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. ఈనెల 5న శ్రీరస్తు శుభమస్తు చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా శ్రీరస్తు శుభమస్తు గురించి హీరో అల్లు శిరీష్ తో ఇంటర్ వ్యు మీకోసం..
శ్రీరస్తు శుభమస్తు కథ ఏమిటి..?
ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే విభిన్నమైన ప్రేమకథా చిత్రం. తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎలాంటి సమస్యలును ఎదుర్కొన్నాడు ఆఖరికి ఫ్యామిలీ మెంబర్స్ ని ఎలా ఒప్పించాడు అనేది కథ. కథ చెబితే సింపుల్ గా అనిపించినా...కథనం మాత్రం కొత్తగా, డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా లావణ్య - నాకు మధ్య ఉండే లవ్ ట్రాక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫాదర్ - డాటర్ మధ్య చిత్రీకరించిన సీన్స్, అలాగే ఫాదర్ - సన్ మధ్య చిత్రీకరించిన సీన్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటూ అందర్నీ ఆకట్టుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే...ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటూ కొత్తగా ఉండే కమర్షియల్ మూవీ.
మీ కంటే సీనియర్ అయిన హీరోయిన్ లావణ్య తో వర్క్ చేస్తున్నప్పుడు ఏమినించింది..?
లావణ్య నటించిన సినిమాలు చూడలేదు. అందాల రాక్షసి కూడా చూడలేదు. అయితే...ఈ చిత్రంలో అను అనే క్యారెక్టర్ కి లావణ్య కరెక్ట్ గా సెట్ అవుతుంది అనిపించింది. స్ర్కీన్ టెస్ట్ చేసి సెలెక్ట్ చేసాం. షూటింగ్ స్టార్ట్ చేసిన మూడో రోజున లావణ్య కరెక్ట్ ఛాయిస్ అనిపించింది. ఆమె నటిస్తుంటే అసలు నటిస్తున్నట్టు అనిపించదు. నేచురల్ ఏక్టరస్. ఆమెతో కలిసి నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్..!
ఇంతకీ ...మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నా క్యారెక్టర్ పేరు శిరీష్. ఎప్పుడూ సరదాగా ఉంటూ అమ్మాయిని గిల్లుతూ ఏడిపిస్తూ ఉంటాను. ఇంకా చెప్పాలంటే..మన పక్కంటి అబ్బాయిని చూస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది.
సీనియర్ ఏక్టర్స్ ప్రకాష్ రాజ్, రావు రమేష్ లతో కలిసి వర్క్ చేసారు కదా..? ఎలా ఫీలయ్యారు..?
ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు సీనియర్ ఏక్టర్స్ అని మనం అనుకుంటాం కానీ..సెట్ లో వాళ్లు అలా ఫీలవ్వరు. అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త ఆర్టిస్టుల వలే సీన్ బాగా రావడం కోసం కష్టపడుతుంటారు. అలాగే సీనియర్స్ తో కలిసి నటించిన సన్నివేశాల్లో బాగా నటించాలనే పట్టుదలతో చేస్తుంటాం. ఆవిధంగా సీనియర్స్ ప్రకాష్ రాజ్, రావు రమేష్ లతో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్..!
శ్రీరస్తు శుభమస్తు చిరంజీవి గారు నటించిన పాత సినిమా టైటిల్. అది తెలిసే ఈ టైటిల్ పెట్టారా..?
ఈ సినిమాకి ఏ టైటిల్ పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తూ...నెట్ లో సెర్చ్ చేస్తుంటే కన్నడ సీరియల్ అనుకుంట శ్రీరస్తు శుభమస్తు టైటిల్ వచ్చింది. ఆతర్వాత ఫ్యాన్స్ ఎవరో చెప్పారు ఇది చిరంజీవి గారు నటించిన సినిమా టైటిల్ అని. అయితే...ఈ టైటిల్ పెడదామని మా టీమ్ కి చెబితే సాఫ్ట్ టైటిల్ అన్నారు. కానీ...బాగుంటుంది అని చెప్పి ఒప్పించాల్సి వచ్చింది (నవ్వుతూ..)
చిరంజీవి గారు పరుశురామ్ డైలాగ్స్ చాలా బాగా రాసాడు అన్నారు కదా..పరుశురామ్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?
పరుశురామ్ మంచి రైటర్. చిరంజీవి గారు అన్నట్టు ఈ సినిమాలో చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. నన్ను పరుశురామ్ చాలా బాగా గైడ్ చేసారు. పరుశురామ్ తో వర్క్ చేసిన తర్వాత డైరెక్టర్స్ పై నాకు గౌరవం పెరిగింది.
మీ సొంత నిర్మాణ సంస్థలోనే శ్రీరస్తు శుభమస్తు నిర్మించారు కదా..! నిర్మాణంలో మీ ఇన్ వాల్వ్ మెంట్..?
అన్ని చూసుకునే నాన్న గారు, బన్ని వాసు ఉండగా నేను నిర్మాణంలో ఇన్ వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినా ఏక్టర్ అనే వాడు ఏక్టింగ్ పైనే ఫోకస్ పెట్టాలి అని నా అభిప్రాయం.
శ్రీరస్తు శుభమస్తు సినిమా చూసి చిరంజీవి గారు బొమ్మరిల్లు గుర్తుకువచ్చింది అన్నారు.. కథ చెబుతున్నప్పుడు మీకు ఏ సినిమా గుర్తకువచ్చింది..?
చిరంజీవి గారు అలా..ఎందుకు అన్నారో నాకు అర్ధం కాలేదు కానీ...నాకు మాత్రం ఈ కథ చెబుతున్నప్పుడు కొంచెం డిడిఎల్ లా అనిపించింది.
శ్రీరస్తు శుభమస్తు హైలైట్స్ ఏమిటి..?
ఎంటర్ టైన్మెంట్ & స్టోరీ
మీ బ్రదర్ బన్ని సపోర్ట్ ఎలా ఉంది..?
నాకు అన్నయ్య మంచి సపోర్ట్ ఇస్తుంటాడు. ఈ సినిమా ప్రారంభించే ముందు కథ చెప్పాం. షూటింగ్ పూర్తయిన తర్వాత ఫస్ట్ కాపీ చూపించాం. కొన్ని సలహాలు ఇచ్చాడు. మాకు కూడా కరెక్ట్ అనిపించడంతో అన్నయ్య ఇచ్చిన సలహాలను తీసుకున్నాం.
మీరు నిర్మాత అవుతారు అనుకుంటే సడన్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చారు కారణం..?
చిన్నప్పటి నుంచి సినిమా రంగంలో ఏదొ ఒకటి చేయాలి అని ఉంది కానీ...ఏం చేయాలి అనే విషయం పై క్లారిటీ లేదు. ఎడిటర్ అవుదామని ఎడిటింగ్ నేర్చుకున్నాను. జల్సా సినిమాకి ప్రమోస్ నేనే కట్ చేసాను. ఆతర్వాత డైరెక్టర్ అవుదామనుకుని యు.ఎస్ లో డైరెక్షన్ కోర్స్ చేసాను. ఆతర్వాత డైరెక్షన్ నా వల్ల కాదు అని తెలుసుకున్నాను. అమీర్ ఖాన్ తో గజిని చిత్రాన్ని నిర్మించినప్పుడు ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటూ స్టోరీ సిట్టింగ్స్ లో పాల్గొనేవాడిని. ఫైనల్ గా ఇది ఏదీ కాదు హీరో అని ఫిక్స్ అయ్యాను. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాను.
గౌరవం, కొత్త జంట ఈ రెండు చిత్రాల ద్వారా ఏం నేర్చుకున్నారు..?
ఈ రెండు చిత్రాల ద్వారా నేను ఏ క్యారెక్టర్ కి సూటవుతానో ఆ క్యారెక్టరే చేయాలి అని తెలుసుకున్నాను.
మీ హాబీస్ ఏమిటి..?
ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. అలాగే డ్రెస్లు, ఎలక్ట్రానిక్స్, రీడింగ్ అంటే ఇష్టం. అలాగే సినిమాలు ఎక్కువు చూస్తుంటాను. సినిమా నచ్చితే చూసిన సినిమానే ఎక్కువ సార్లు చూస్తుంటాను.
మెగా ఫ్యామిలీ హీరో అంటే మాస్ సినిమాలు చేస్తారు. ఆడియోన్స్ కూడా మాస్ మూవీస్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. మరి...మీరేమో శ్రీరస్తు శుభమస్తు అంటూ సాఫ్ట్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు..?
మెగా ఫ్యామిలీ హీరో అంటే మాస్ మూవీస్ ఎక్స్ పెక్ట్ చేస్తారు కరెక్టే కానీ...నేను మసాలా సినిమాలను పెద్దగా ఇష్టపడను. లవ్, ఫన్ ఉండే సినిమాలనే ఇష్టపడతాను. ప్రస్తుతం అలాంటి సినిమాలనే చేయాలనుకుంటున్నాను.
అంటే...మీరు మాస్ మూవీస్ చేయరా..?
దేనికైనా టైమ్ రావాలి. బన్ని కూడా ఫస్టే మాస్ మూవీ చేయలేదు. టైమ్ వచ్చిన తర్వాత చేసాడు. నేను అంతే... టైమ్ వచ్చినప్పుడు చేస్తాను. అంతే కానీ...ఇప్పుడే మాస్ మూవీ చేసేయాలి అనే కంగారు లేదు. గత రెండు సంవత్సరాల నుంచి హర్రర్ & మాస్ మూవీసే వస్తున్నాయి. శ్రీరస్తు శుభమస్తు తరహా చిత్రాలు రావడం లేదు. నేను 100% లవ్, ఎటో వెళ్లిపోయింది మనసు, అ ఆ తరహా చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తాను. ప్రస్తుతం అలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాను.
మీ నెక్ట్స్ మూవీ కూడా శ్రీరస్తు శుభమస్తు తరహాలోనే ఉంటుందా..?
అది డిఫరెంట్ మూవీ. అందులో విలన్ ఉంటాడు. పిరియాడిక్ ఎపిసోడ్ ఉంటుంది. మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాకపోతే...రెగ్యులర్ మాస్ మూవీ కాదు డిఫరెంట్ మూవీ. హీరో క్యారెక్టరైజేషన్ డైనమిక్ గా ఉంటూ సరైనోడు తరహా మాస్ సినిమాలు ప్రస్తుతానికి చేయదలచుకోలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments