రాజమౌళిలో అదొక్కటే నాకు నచ్చదు..: కీరవాణి
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు, టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి అలియాస్ జక్కన్న గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది. ఈయన తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమానే ఇందుకు నిదర్శనం. ఇక అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో నటీనటులు, దర్శక నిర్మాతలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సందర్భంగా యూట్యూబ్, టీవీ చానెల్స్‌కు గట్టిగానే ఆన్లైన్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జక్కన్న గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అదే నాకు నచ్చనిది..
జక్కన్న గురించి చెప్పమంటే మీరేం చెబుతారు..? ఆయనలో మీకు నచ్చేవి ఏంటి..? నచ్చనివి ఏంటి..? అని ప్రశ్న కీరవాణికి ఎదురవ్వగా ఆయన సమాధానం ఎలా చెప్పారో చూడండి. ‘రాజమౌళి ఏకాగ్రత, ఆయనలోని పట్టుదల, ఏదైనా సరే నేర్చుకోవాలనే తపనంటే నాకు ఇష్టం. రాజమౌళి ఎక్కువగా చిన్న పిల్లల చిత్రాలు చూస్తుంటారు. అవి కాకుండా ముఖ్యమైన సినిమాలు కొన్ని వీక్షించమని చెప్పినా పట్టించుకోరన్నారు. ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా దూరంగా వెళ్లి చూస్తుంటారు. అదే రాజమౌళిలో నాకు నచ్చని విషయం’ అని కీరవాణి చెప్పుకొచ్చారు.
హిట్ కాంబో..
జక్కన్న-కీరవాణి ఇద్దరూ ఒకే కుటుంబంలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి సతీమణులు అక్కా చెల్లెళ్లు. దీంతో వీరిద్దరి మధ్య సత్సంబంధాలు చాలా మంచిగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమా చేశారంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ‘స్టూడెంట్ నంబర్-1’ చిత్రంతో ప్రారంభమైన ఈ ఇద్దరి కాంబో ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’కు కూడా సంగీతం అందిస్తున్నది కీరవాణే. దాదాపు జక్కన్న సినిమాలకు ఈయనే సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుంటారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూవీలన్నీ సూపర్ డూపర్ హిట్‌గానే నిలిచాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout