వారెవరో నాకు తెలియదు.. ఫేక్ న్యూస్ ప్రచారం చెయ్యొద్దు: పూర్ణ

  • IndiaGlitz, [Tuesday,June 30 2020]

తనను, తన కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ షమ్నా ఖాసిం(పూర్ణ).. సినీ నటుడు ధర్మజన్ బోల్గట్టితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయమై మీడియా ఉన్నవి.. లేనివి ప్రచారం చేస్తోందని.. దానిపై ఆమె ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు.

‘‘ఈ విపత్కర సమయంలో నాకు తోడుగా ఉండి మీ సపోర్ట్‌ని నాకు అందించినందుకు నా స్నేహితులకి, శ్రేయోభిలాషులకి థాంక్యూ. నేను నా కేసుకు సంబంధించి మీకు, మీడియాకు కొన్ని విషయాలను క్లారిఫై చేద్దామనుకుంటున్నా. నన్ను బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తులు గానీ వారికి సంబంధించిన గ్యాంగ్ గురించి గానీ నాకేమాత్రం తెలియదు కాబట్టి వారితో నన్ను లింక్ చేస్తూ ఫేక్ న్యూస్‌ని ప్రచారం చెయ్యొద్దు. మ్యారేజ్ ప్రపోజల్ పేరుతో వచ్చి తప్పుడు పేర్లు, అడ్రస్‌లతో నా ఫ్యామిలీని మోసగించారు కాబట్టే మేము పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇది క్రమంగా బ్లాక్‌మెయిల్‌కి దారి తీయడంతో మాకు పోలీసుల్ని ఆశ్రయించక తప్పలేదు. ఇప్పటికీ వారి ఇన్‌టెన్షన్ ఏంటో మాకు తెలియదు.

కేరళ పోలీసులు నేను ఫిర్యాదు చేసిన తరువాత నిందితులందరినీ పట్టుకున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేవరకూ దయచేసి మీడియా మిత్రులెవరూ.. ఈ కేసులో కానీ నా పర్సనల్ విషయాల్లో గానీ జోక్యం చేసుకోవద్దు. కేసు విచారణ పూర్తయ్యాక నేనే మీడియా ముందుకు వస్తాను. కాబట్టి ఈ కష్ట సమయంలో సపోర్ట్‌ను అందిస్తున్న ప్రతి ఒక్కరినీ నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నా కేసు ద్వారా అయినా నాతో తోటి సోదరీమణులంతా ఇలాంటి ఫ్రాడ్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారని భావిస్తున్నా’’ అని నటి పూర్ణ వెల్లడించారు.

More News

చిరు సోద‌రి పాత్ర‌లో మ‌రోసారి ఆ సీనియ‌ర్ హీరోయిన్‌

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేశ్ కోసం భారీ సెట్‌!!

మాయదారి క‌రోనా అని సినీ జ‌నాలు క‌రోనా గురించి తెగ తిట్టుకుంటున్నారు. కోవిడ్ 19 ప్ర‌భావంతో బాగా ఇబ్బందులు ప‌డుతున్న రంగాల్లో సినీ రంగం ముందు వ‌రుస‌లో ఉంది.

‘గరీబ్ కల్యాణ్ యోజన’ను దీపావళి వరకూ పొడిగిస్తున్నాం: మోదీ

కరోనా విషయంలో మరింత అప్రమత్తత వహించాల్సిన సమయంలో మరింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

ఏమాత్రం ఊహించని.. షాకింగ్ విషయాన్ని వెల్లడించిన డబ్య్లూహెచ్‌వో

కరోనా ప్రారంభం నుంచి నేటి వరకూ ఏ ఒక్కరూ ఊహించని.. షాకింగ్ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

తెలంగాణ రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్షయం తీసుకున్నట్టు తెలుస్తోంది.