స్వార్థ రాజకీయాలు చేయడం నా రక్తంలోనే లేదు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు దగ్గరపడటంతో అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ముఖ్యంగా ఏ ఎన్నికలొచ్చినా కడప జిల్లా పులివెందుల తర్వాత పులివెందుల-02గా పేరుగాంచిన రాయచోటి నియోజకవర్గంలో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంటుంది. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ వేదికగా పలువురు రాయచోటి నియోజకవర్గానికి చెందిన సెటిలర్స్, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ మీటింగ్‌పై రాయచోటి టీడీపీ అభ్యర్థి అయిన రమేశ్ రెడ్డి సెటైర్లేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీకాంత్ రెడ్డి మీడియా ముందుకొచ్చి స్ట్రాంగ్ కౌంటర్ల వర్షం కురిపించారు. రాయచోటి వైసీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన రమేశ్‌కు దిమ్మదిరికే కౌంటరిచ్చారు.
శ్రీకాంత్ మాటల్లోనే...
"స్వార్థపు రాజకీయాలు చేయడం నారక్తంలోనే లేదు. ఉపాధ్యాయులుతో, పారా మెడికల్ సిబ్బందితో, హైదరాబాద్‌లో ఉన్నటువంటి మన నియోజక వర్గానికి చెందిన ఐటీ ఉద్యోగులు, ఇతర యువతతో మేం ఆత్మీయ సమావేశాలు పెడితే వాటిని చులకనగా మాట్లాడిన మీరు ఏపాటి సంస్కార వంతులో అర్థమవుతోంది. నేను ఏ ఆత్మీయ సమావేశంలోను ఏ ఒక్కరినీ ఓటు అడగలేదని, భవిష్యత్తు తరాల కోసం, రాయచోటి అభివృద్ధి కోసం సలహాలు, సూచనలను తీసుకున్నానంతే. ప్రజాదరణ మీకుందో.. నాకుందో ప్రజలే నిర్ణయిస్తారు. ఎన్నికల సమయంలోనే ప్రజల దగ్గర ఉండాలని చూసేది మీరు, నేను అనునిత్యం ప్రజలతోనే వుంటాననేది మీకూ తెలుసు. హుందాతనంతో రాజకీయాలు చేద్దాం. స్థాయికి తగ్గట్లు మాట్లాడుదాం. ఉనికి కోసం చౌకబారు విమర్శలు మానుకో" అని టీడీపీ అభ్యర్థి రమేశ్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout