బన్ని ఎలా ఎందుకు అన్నాడో తెలియదు...నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు - సాయిధరమ్ తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
రేయ్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్....ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం తిక్క. ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తిక్క చిత్రాన్ని తెరకెక్కించారు. సి.రోహిన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన తిక్క చిత్రాన్ని ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తిక్క హీరో సాయిధరమ్ తేజ్ తో ఇంటర్ వ్యూ మీకోసం..
తిక్క సినిమా ఎలా ఉంటుంది..?
నేను ఇప్పటి వరకు చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కొత్త జోనర్ లో ఉండే సినిమా ఇది. ఆడియోన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు కాకపోతే ఎలా రిసీవ్ చూసుకుంటారు అనే చిన్న భయం ఉంది.
తిక్క కథ ఏమిటి..?
ఇది ఫుల్ జోష్ లో ఉండే ఓ యువకుడి బ్రేక్ అప్ స్టోరీ. తాగడం వలన ఆ యువకుడు జీవితంలో చాలా కోల్పోతాడు. ఆతర్వాత ఏం జరిగింది అనేది చాలా ఇంట్రస్టింగ్ గా చూపించాం. ఇంకో విషయం ఏమిటంటే...ఈ కథ అంతా ఒక రోజులో జరుగుతుంది. దీని కోసం చాలా కేర్ తీసుకున్నాం.
తిక్క అని నెగిటివ్ టైటిల్ పెట్టాడానికి కారణం..?
కథకి అనుగుణంగా తిక్క అనేది యాప్ట్ అని పెట్టాం అంతే తప్పా...నెగిటివ్ టైటిల్ కావాలని కానీ...నెగిటివ్ అవుతుందేమో అని కానీ అసలు ఆలోచించలేదు.
ఈ చిత్రంలో ధనుష్ - శింబు పాట పాడారు కదా..! ఆ ఆలోచన ఎవరిది..?
అది తమన్ ఐడియా. తమన్ అడగగానే ధనుష్ - శింబు వెంటనే ఓకే చెప్పారు.
ఈ సినిమాని పిల్లా నువ్వు లేని జీవితం టైమ్ లో ఓకే చేసారు కదా..! సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో మీ ఇమేజ్ పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తిక్క కథలో మార్పులు ఏమైనా చేసారా..?
స్ర్కిప్ట్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాకపోతే కొంచెం ఎంటర్ టైన్మెంట్ పెంచాం.
నిర్మాత రోహిణ్ రెడ్డి నిర్మాణ రంగంలో ప్రవేశించి ఫస్ట్ టైమ్ మీతో సినిమా నిర్మించారు కదా..! ఆయన ప్రొడక్షన్ హౌస్ గురించి ఏం చెబుతారు..
నిర్మాణపరంగా ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించారు. పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైమ్ కి అనుకున్న విధంగా ఈ చిత్రం చేసాం. ఈ చిత్రానికి వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులను అందరినీ మా నిర్మాత రోహిణ్ రెడ్డి గారు చాలా బాగా చూసుకున్నారు. ఆయన ఖర్చు పెట్టింది ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.
తిక్క సినిమాకి హేంగ్ ఓవర్ మూవీకి పోలికలు ఉంటాయి అని ప్రచారం జరుగుతుంది నిజమేనా..?
అలాంటిది ఏమీ లేదండి. హేంగ్ ఓవర్ తో మా సినిమాకి ఎలాంటి పోలికలు ఉండవు.
ఈ చిత్రంలోని పోస్టర్స్ లో మీరు మందు త్రాగుతున్నట్టు కనిపిస్తున్నారు కదా..! ఇలా చేయడం వలన చాలా మంది పై ప్రభావం చూపిస్తుంది కదా..?
అందుకనే ఈ చిత్రంలో మందు తాగడం వలన ఏం కోల్పోతాం అనేది చూపిస్తున్నాం.
మందు కొట్టే సీన్స్ లో నటించేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారు..?
తాగుబోతు రమేష్ మందు కొట్టే సీన్స్ లో బాగా నటిస్తాడు ఆ విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి రమేష్ ని అడిగాను నువ్వు ఎలా చేస్తావ్ అని ..? వాళ్ల ఫాదర్ ని అబ్జర్వ్ చేసేవాడిని అని చెప్పాడు. అలాగే కొన్ని టిప్స్ చెప్పాడు. దీనికి తోడు చిరంజీవి గారి సినిమాల్లో ఈ తరహా సీన్స్ ఉన్నవాటిని పరిశీలించాను. ఆ సీన్స్ లో చిరంజీవి గారు ఎలా చేసారో అబ్జర్వ్ చేసి ఈ సీన్స్ చేసాను.
తిక్క ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ పవర్ స్టార్ అని అరుస్తుంటే...మీరు నేను చెబుతాను బ్రదర్ అన్నారు కదా..! బన్ని చెప్పను బ్రదర్ అంటే తేజు చెబుతాను బ్రదర్ అన్నాడు అంటూ మీ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దీని గురించి మీరేమంటారు..?
నేను ఫ్యాన్స్ స్టేజ్ నుంచి వచ్చినవాడినే. ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో నాకు తెలుసు. అయినా...వాళ్లు ఎవరి గురించి చెప్పమంటున్నారు పవర్ స్టార్. ఆయన నాకు ఏమవుతారు మావయ్య. మరి...మా మావయ్య పేరు చెప్పమంటే నాకు సంతోషమే కానీ... అభ్యంతరం ఏం ఉంటుంది.? బన్ని అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు. కానీ...మా మావయ్య పేరు చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక విషయాన్ని ఒక్కొక్కరు ఒకేలా డీల్ చేస్తుంటారు.
మీ బ్రదర్ కూడా సినిమాల్లోకి వస్తున్నాడు అంటున్నారు నిజమేనా..?
ప్రస్తుతం మా బ్రదర్ చదువుకుంటున్నాడు. ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు.
మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు కదా. ఈ సినిమా ప్రారంభం ఎప్పుడు..?
ఈ నెల 20న షూటింగ్ ప్రారంభించనున్నాం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుంది.
కృష్ణవంశీ నక్షత్రంలో పోలీస్ గా నటిస్తున్నారు కదా షూటింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది..?
ఈ నెల 16 నుంచి షూటింగ్ లో పాల్గొంటాను. ఓ ఇరవై నిమిషాలు ఈ చిత్రంలో కనిపిస్తాను. ఈ చిత్రంలో తనీష్ విలన్ గా నటిస్తున్నాడు. నా రోల్ గురించి పూర్తి డీటైల్స్ తెలియవు. ఎందుకంటే...కృష్ణవంశీ గారు క్యారెక్టర్ చేయమని అడిగారు. ఆయన మీద ఉన్న గౌరవంతో వెంటనే నా రోల్ ఎలా ఉంటుంది అని అడగకుండా ఓకే చెప్పాను.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం, కళ్యాణ్ రామ్ తో కలిసి ఓ చిత్రం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి..?
గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాను. కాకపోతే ఇంకా డిష్కషన్స్ స్టేజ్ లోనే ఉంది. అలాగే కళ్యాణ్ రామ్ తో కలిసి సినిమా చేస్తున్నాను. ఈ చిత్రం కూడా కథాచర్చలు దశలోనే ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com