ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నేనే మిస్టేక్ చేశా.. అసలేం జరిగిందంటే..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న ఈ మూవీ అభిమానుల ముందుకు రానుంది. టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక చిత్రంగా భావిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీరిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లో జరుపుకున్న విషయం విదితమే. ఈ కార్యక్మంలో మహేశ్ మాట్లాడుతూ తనను స్టార్ చేసిన డైరెక్టర్లను మరిచిపోయారు. ఆ తర్వాత తనకు హిట్ మూవీ ఇచ్చి.. సూపర్‌స్టార్ స్థాయికి చేర్చిన ‘పోకిరి’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు మరిచిపోవడంపై ట్విట్టర్ వేదికగా మహేశ్ స్పందించారు. అయినప్పటికీ ట్రోలింగ్స్ మాత్రం ఆగలేదు. అయితే శనివారం మధ్యాహ్నం భాగ్యనగరంలోని ఓ స్టార్ హోటల్‌లో మహేశ్ మీడియా ప్రతినిధులకు కామన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆయన చెబుతూ తనపై వస్తున్న విమర్శలకు, పుకార్లకు చెక్ పెట్టారు.
నా మిస్టేకే..!
ముఖ్యంగా పూరీ, సుకుమార్ పేర్లు ఎందుకు మరిచిపోయాననే విషయంపై మహేశ్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ రోజు ఏమైంది..? ఎందుకు మరిచిపోయారు..? అసలేం జరిగింది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈవెంట్ తాను ఫారిన్ నుంచి వచ్చానని.. యూరప్ నుంచి 16 గంటలకుపైగా విమాన ప్రయాణం చేసి వచ్చానని అప్పటికీ స్టేజ్‌పైకెక్కి మాట్లాడానని మహేశ్ చెప్పారు. అయితే స్టేజ్ మీదకు కొందరు ఫ్యాన్స్ రావడంతో అందరి పేర్లు చెప్పలేకపోయానని.. అది తన మిస్టేకేనని సూపర్‌స్టార్ చెప్పుకొచ్చారు.
సుకుమార్‌ను పాయింట్ చేయలేదు..!
"‘పోకిరి’ నన్ను సూపర్ స్టార్‌ని చేసింది. ‘1’ నా లైఫ్‌లో కల్ట్ సినిమా ఇచ్చినందకు సుకుమార్‌కు థాంక్స్ చెప్పాలి. ఆయన నా కుమారుడితోనూ పనిచేశారు. ఆయన నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఇంకో విషయం చెప్పాలంటే అదే స్టేజ్ మీద ‘వంశీ రెండేళ్లు నాకోసం వెయిట్ చేశాడు. ఈ రోజుల్లో రెండు నెలలు ఎవరూ వెయిట్ చేయడం లేదు’ అనే ఆ మాటను నేను వంశీని పొగిడే అన్నాను తప్ప.. సుకుమార్ పాయింట్ అవుట్ చేసి అన్నది కాదు. అయితే దీనిపై కొంత మంది వార్తలు కూడా రాసేశారు. అందులో ఎలాంటి నిజం లేదు. నిజానికి సుకుమార్ నాకు మంచి ఫ్రెండ్. ఆయనతో భవిష్యత్తులోనూ కలిసి పనిచేస్తాను. ఇలాంటి వార్తలన్నీ అనవసరమైన గందరగోళాన్ని సృష్టించినవి. ఈ వార్తల్లో ఎలాంటి నిజాల్లేవ్. త్వరలోనే సుకుమార్, దర్శకధీరుడు రాజమౌళితో సినిమాలు చేస్తున్నాను" అని మహేశ్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో అభిమానులు, సినీ ప్రియుల్లో నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచ్‌లయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే సుకుమార్, జక్కన్న ఎలాంటి సినిమాలు తీస్తారా..? ఎప్పుడు సెట్స్ మీదికెళ్తుంది..? సినిమా టైటిల్ ఎలా ఉంటుంది..? అని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout