నా ఫిల్మోగ్రఫీలో 'మా నీళ్ల ట్యాంక్' ఉంటుందని గర్వంగా చెప్పగలను: సుశాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తుంది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ నుండి ‘గాలివాన’ ప్రదర్శించిన తర్వాత, ఇది ఇటీవల వచ్చిన ‘రెక్కీ’ కూడా ఎంతో సూపర్ హిట్ అయ్యి వీక్షకుల మనసులు గెలుచుకుంది. తాజాగా టాలీవుడ్ నటుడు సుశాంత్ OTT అరంగేట్రం చేసిన 'మా నీళ్ల ట్యాంక్' ఈ నెల 15 నుండి స్ట్రీమింగ్ కోసం సిద్ధమవుతోంది. 8-ఎపిసోడ్ల సిరీస్ ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి నాటకం. .ఈ సిరీస్ -ఒక చిన్న గ్రామం ఆధారంగా రూపొందించ బడిన రొమాంటిక్ కామెడీ తో హార్ట్‌త్రోబ్ “మా నీళ్ల ట్యాంక్’. ఈ వెబ్ సిరీస్ ఎంతో రిఫ్రెసింగ్ గా ఉంటుంది. ఇందులో నటి ప్రియా ఆనంద్ 10 సంవత్సరాల విరామం తర్వాత తెలుగు తెరపై నటిస్తున్న ఈ సిరీస్‌కి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు సుశాంత్ పాత్ర ప్రోమోను నేచురల్ స్టార్ నాని ఆవిష్కరించారు. ప్రియా ఆనంద్ పాత్ర ప్రోమోను దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రారంభించారు. పాన్ ఇండియా స్టార్ పూజా హెగ్డే "మా నీళ్ల ట్యాంక్" ట్రైలర్‌ను ఆవిష్కరించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 15 న ZEE5 లో స్త్రీమ్ అవుతున్న సందర్బంగా "మా నీళ్ల ట్యాంక్" ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యఫ్. హౌస్ లో ఘనంగా జరుపు కున్నారు.ఈ కార్యక్రమానికి ZEE5 టీం రాధా గారు, అనురాధ గారు, సుభాష్ గారు, తేజ్ రాజ్, లాయిడ్ గారు, శశాంక్ గారు, మ్యాత్యు గార్లు పాల్గొన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
వంశీగా నటించిన సుశాంత్ మాట్లాడుతూ.. నేను చాలా వెబ్ సిరీస్ కథలు విన్నాను కానీ అవేవి నచ్చక ఓకే చెయ్యలేదు. నాకు ZEE 5 నుండి రాధా గారు, లక్ష్మి సౌజన్య గారు 8 ఎపిసోడ్స్ ల స్క్రిప్ట్ చదవమని ఇచ్చారు. నాకది కనెక్ట్ అవ్వడంతో ఆ స్క్రిప్ట్ ఓటిటి కా,సినిమా కా, వెబ్ సిరీస్ కా అని అని చూడకుండా స్క్రిప్ట్ నచ్చడంతో మా నీళ్ల ట్యాంక్ చేయడం జరిగింది.ఈ సిరీస్ షూట్ లొకి వచ్చినప్పుడు సినిమా కంటే వెబ్ సిరీస్ లలో ఎక్కువ మంది నటిస్తున్నారు అనిపించింది.నిర్మాత ప్రవీణ్ కొల్ల గారు చీరాల దగ్గర నాగులపాలెం లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. దర్శకురాలు లక్ష్మి సౌజన్య గారు ప్రతి క్యారెక్టర్ ను చాలా కేర్ తీసుకొని చాలా చక్కగా తెరకెక్కించారు. ZEE 5 లోని రాధా గారు, అనురాధ గారు, సుహాస్ గారు, సోషల్ మీడియా టీం లాయిడ్ గారు, శశాంక్, శ్వేత,ఇలా ప్రతి ఒక్కరూ మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇందులో నటించిన వారందరూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా చక్కగా నటించాము.ఈ వెబ్ సిరీస్ ను చూస్తుంటే ఇందులోని ప్రతి క్యారెక్టర్స్ మీకు గుర్తుండి పోతుంది. ఎంటర్టైన్మెంట్ మాత్రం గోపాల్ గా నటించిన సుదర్శన్ ఎక్కువిస్తాడు.ఈ సిరీస్ నాకు మోస్ట్ ఎంజాయ్ బుల్ ప్రాజెక్టు.ఎందుకంటే ఇందులో నేను చాలా ఓపెనప్ అవ్వాల్సి వచ్చింది.ఇందులో నేను చాలా వెటకారంగా, సరదాగా ఉండే వంశీ క్యారెక్టర్ లో చాలాఎంజాయ్ చేస్తూ నటించాను. నా చిత్రాలు చి. ల. సౌ, అలవైకుంఠపురం, నో పార్కింగ్ తరువాత నేను మొదటి సారి రూరల్ బ్యాక్ డ్రాప్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను. ఇప్పటి వరకు ఇలాంటి ఓపెనప్ క్యారెక్టర్ చేయలేదు. నేను ప్రౌడ్ గా చెప్పగలను ఇప్పటి వరకు నేను చేసిన ఫిలిమోగ్రఫీ లో "మా నీళ్ల ట్యాంక్" ఉంటుందని గర్వంగా చెప్పగలను.ఇప్పుడున్న ఆడియన్స్ ట్రెస్ కు,కురుస్తున్న వర్షాలకు అందరూ ఇళ్లలోనే వుంటున్నారు. కాబట్టి ఆడియన్స్ అందరూ హ్యాపీ గా ఇంట్లో కూర్చొని "మా నీళ్ల ట్యాంక్" వెబ్ సిరీస్ చూడండి చూస్తూనే ఉండి పోతారు అని అన్నారు.
ZEE 5 హెడ్ తేజ మాట్లాడుతూ .. నేను కచ్చితంగా చెప్పగలను. "మా నీళ్ల ట్యాంక్'' సిరీస్ ను సకుటుంబ సపరివార సమేతంగా చూసి కడుపుబ్బ నవ్వుకునేలా ఉంటుంది. ప్రతి నెల మంచి ఎంటర్ టైన్మెంట్ తో ప్రతి తెలుగింటికి కచ్చితంగా రీచ్ అవ్వబోతున్నాము అనే నమ్మకం ఉంది. పల్లెటూర్లలోని పాత్రలు మన చుట్టూ వున్నట్టే అన్నీ ఈ షో లో కనిపిస్తాయి . పల్లెటూరు నుండి పట్నం వచ్చిన ప్రతి ఒక్కరికీ పల్లెటూరులోని గత స్మృతులను ఈ సిరీస్ ద్వారా గుర్తు చేయబోతున్నాము.ఇది తెలుగు వారి షో కాబట్టి తెలుగువారికి కచ్చితంగా నచ్చుతుంది.ఒక మంచి కామెడీ షో "మా నీళ్ల ట్యాంక్" ను అందరూ చూస్తారు ఎంజాయ్ చేస్తారు.నవ్వుకుంటారు, ఇందులో ప్రియా ఆనంద్ మాత్రం అప్పుడప్పుడూ ఏడిపిస్తుంది కూడా.. .సుశాంత్ గారు ప్రియా ఆనంద్ లు చక్కటి నటనను ప్రదర్శించారు.ఈ సిరీస్ కు నటీ,నటులు, టెక్నిషియన్స్ అందరూ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు.. ఈ సిరీస్ కొరకు కష్టపడిన రాధా గారికి, సుహాస్ గారికి అలాగే వెన్నుండి నడిపించిన అనురాధ గారికి మా డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య గారికి అందరికి అల్ ద బెస్ట్.
ZEE 5 ట్యాగ్ లైన్ లోనే ఉంది చూస్తూనే ఉండిపోతారు. ఈ నెల 15 న ZEE 5 లో ప్రసారమవుతున్న ఈ షో తో ప్రేక్షకులకు ZEE 5 టి.వి కు అతుక్కుపోతారనే నమ్మకం ఉందని అన్నారు
క్రియేటివ్ ప్రొడ్యూసర్ శ్రీ చైతు మాట్లాడుతూ.. ఇందులో నటించిన వారందరూ ఎంతో సహజమైన నటనను కనబరచారు.ఇంత మంచి సబ్జెక్టు కు లో నేను పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ నెల 15 న ZEE 5 లో ప్రసారమవుతున్న మా "నీళ్ల ట్యాంక్" చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
సురేఖగా నటించిన ప్రియా ఆనంద్ మాట్లాడుతూ.. పది సంవత్సరాల తరువాత ఈ స్టేజ్ పై తెలుగులో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. అందుకు ZEE 5 వారికి థాంక్స్ చెప్పుకోవాలి.నాకిది చాలా స్పెషల్ సిరీస్ .పది సంవత్సరాల తర్వాత ఒక తెలుగు షో లో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.సుశాంత్ తో వర్క్ చేయడం చాలా ఎగ్జయిట్ గా ఉంది. మొదటి సారి తనతో నటిస్తున్నాను. ఒక మంచి క్యూట్ ఏమోనల్ ఫీల్ గుడ్ స్టోరీ ఇది. మోస్ట్ డిమాండింగ్, కమాండింగ్, కంట్రోలింగ్ చేసే లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తో వర్క్ చేయడం చాలా ఎంజాయింగ్ గా అనిపించింది. ఈ షో కు చాలా అమేజింగ్ యాక్టర్స్ పని చేశారు ఇందులో చేసిన ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఆలా ప్రతి క్యారెక్టర్ గుర్తుండి పోతారు.సురేఖ పాత్రలో నేను చాలా కష్టపడినా ఎంతో ఎంజాయ్ చేశాను. నా కెరియర్ లో 13 ప్రాజెక్ట్స్ తరువాత ఇంత కష్టపడి షూటింగ్ చేయలేదు. నా డైలాగ్స్ అన్ని నేర్పించారు. డబ్బింగ్ చెప్పించారు.జులై 15 న ZEE 5 లో స్ట్రీమింగ్ అవుతున్న "మా నీళ్ల ట్యాంక్" వెబ్ సిరీస్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సబ్జెక్టు ఉన్న "మా నీళ్ల ట్యాంక్" కు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు
గోపాల్ గా నటించిన సుదర్శన్ మాట్లాడుతూ.. లక్ష్మీ సౌజన్య గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ గా వుంది. నిర్మాతలు మమ్మల్ని బాగా చూసుకున్నారు. ZEE 5 యూనిట్ లోని రాధా గారు ,అనురాధ గారు,సుహాస్ గారు, చైతన్య, కిరణ్ బయ్యా వీరంతా మాకు ఫుల్ సపోర్ట్ చేయడంతో మేము ఆడుతూ పాడుతూ షూట్ చేశాము ఇందులో నటించిన ప్రతి ఒక్కరితో మొదటి సారి నటించినా ఎన్నో సినిమాలలో నటించిన ఫీల్ కలిగింది .అందరూ చాలా హ్యాపీ గా కలసి వర్క్ చేశాము. చాలా డౌన్ టూ ఎర్త్ లో ఉండే సుశాంత్ గారితో నటించడం చాలా ఆనందం వేసింది.ప్రియా ఆనంద్ కూడా చాలా ఫ్రెండ్లీ గా మాతో కలసి పోయారు. మాకిలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న "మా నీళ్ల ట్యాంక్" లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు
కోదండం గా నటించిన ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ ... అందమైన అనురాగమైన "మా నీళ్ల ట్యాంక్" వెబ్ సిరీస్ ను సకుటుంబ సపరివార సమేతంగా చూసే విధంగా ఉంటుంది అన్నారు.
వాసు మాట్లాడుతూ.. ఇందులో నేను మంచి క్యారెక్టర్ చేశాను. ఈ కథ అంతా నీళ్ల ట్యాంక్ చుట్టూ తిరుగుతుంది.సుశాంత్ తో నేను మొదటి సారి నటిస్తున్నాను. ఇందులోని ఫన్, ఎమోషన్ సీన్స్ లలో సుశాంత్ అద్భుతంగా నటించాడు. మాకు దర్శక, నిర్మాతలు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సిరీస్ చాలా చక్కగా వచ్చింది. ఈ నెలల 15 న ZEE 5 లో ప్రసార మవుతున్న "మా నీళ్ల ట్యాంక్" సిరీస్ చూసి ఆశీర్వాదిస్తారని కోరుకుంటున్నాము అన్నారు
లావణ్య గా నటించిన రేవతి మాట్లాడుతూ.. సుశాంత్ గారు ఈ సిరీస్ కొరకు స్లాంగ్ నేర్చుకొని యాక్ట్ చేయడం గ్రేట్. ప్రియా చాలా చక్కగా నటించింది. ఈ నెల 15 న "మా నీళ్ల ట్యాంక్" మీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరినీ ఎంటర్ టైన్ చేస్తుంది.ZEE 5 నుండి ఇలాంటి మంచి వెబ్ సిరీస్ లు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
రమ్యగా నటించిన దివి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లో నటించే అవకాశం కల్పించిన ZEE 5 యాజమాన్యానికి, దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు
ఇంకా ఈ కార్యక్రమంలోపాల్గొన్న వారందరూ మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ లో నటించే నటించే అవకాశం కల్పించిన జీ 5 యాజమాన్యానికి, దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com