నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదండి..ఆవిషయంలో పూర్తి నమ్మకం ఉంది - హీరోయిన్ రెజీనా

  • IndiaGlitz, [Thursday,December 24 2015]

ఎస్.ఎం.ఎస్, రొటీన్ ల‌వ్ స్టోరి, రారా క్రిష్ణ‌య్య‌, కొత్త జంట‌, ప‌వ‌ర్, పిల్లా నువ్వులేని జీవితం...త‌దిత‌ర చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ రెజీనా. తాజాగా రెజీనా గోపీచంద్ స‌ర‌స‌న న‌టించిన చిత్రం సౌఖ్యం. ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి తెర‌కెక్కించిన సౌఖ్యం ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా సౌఖ్యం గురించి రెజీనాతో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

సౌఖ్యం సినిమాలో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

డైరెక్ట‌ర్ ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి గారు...త‌న సినిమాలో ఏదో ఒక ప్రాబ్ల‌మ్ చూపిస్తారు. అలాగే ఆ ప్రాబ్ల‌మ్ ని ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తారు. పిల్లా నువ్వులేని జీవితం లో నా క్యారెక్ట‌ర్ ఎలా ఉందో...ఇంచుమించు సౌఖ్యం లో కూడా అలా ఉంటుంది. కాక‌పోతే ఆ సినిమాలో ఉన్నంత సీరియ‌స్ గా ఈ సినిమాలో ఉండ‌ను. నా పాత్ర అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది.

డైరెక్ట‌ర్ ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రితో సెకండ్ టైమ్ వ‌ర్క్ చేసారు. ఆయ‌న వ‌ర్కింగ్ స్టైల్ గురించి..?

ఆయ‌న ఆర్టిస్ట్ ల‌కు ఫ్రీడ‌మ్ ఇస్తారు. ముందు సీన్ గురించి చెప్పి ఆత‌ర్వాత మీరు ఎలా యాక్ట్ చేస్తారో చెయ్యండి అంటారు. ఆర్టిస్ట్ లు నుంచి త‌న‌కు కావాల‌సిన విధంగా న‌ట‌న‌ను రాబ‌ట్టుకుంటారు. ర‌వి కుమార్ చౌద‌రి గారితో సెకండ్ టైమ్ వ‌ర్క్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది.

గోపీచంద్ తో ఫ‌స్ట్ టైం వ‌ర్క్ చేసారు క‌దా..? సెట్స్ లో గోపీచంద్ ఎలా ఉండేవారు..?

అవును...గోపీచంద్ గారితో ఫ‌స్ట్ టైం వ‌ర్క్ చేసాను. సెట్స్ లో చాలా సైలెంట్ గా ఉంటారు. ఒక్కసారి కెమెరా ఆన్ అయ్యిందంటే ఏసీన్ అయినా స‌రే సింపుల్ గా చేసేస్తారు. అలాగే...సీన్ ను ఇంకా బెట‌ర్ గా ఎలా చేయచ్చు అని డైరెక్ట‌ర్ తో డిష్క‌స్ చేస్తారు. నిజంగా గోపీచంద్ గారితో వ‌ర్క్ చేయ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి.

గోపీచంద్ లో ఉన్న ప్ల‌స్ అండ్ మైన‌స్ ఏమిటి..?

త‌ను ఎలాంటి క్యారెక్ట‌ర్స్ చేస్తే బాగుంటుంది..? ఎలాంటి క్యారెక్ట‌ర్స్ బాగోవు..అనే విష‌యం పై పూర్తి అవ‌గాహ‌న ఉంది. అది ప్ల‌స్ అనుకుంటే...ఆయ‌న ఎవ‌రితో ఎక్కువుగా మాట్లాడ‌రు సైలెంట్ గా ఉంటారు అది మైన‌స్ అనుకుంటున్నాను.

గోపీచంద్ ప్ల‌స్ అండ్ మైన‌స్ చెప్పారు..మ‌రి..మీ గురించి అడిగితే..?

నాలో ఉన్న మైన‌స్ అంటే నేను చాలా ఎక్కువుగా మాట్లాడ‌తాను. అది ఒక్క‌సారి ప్ల‌స్ అవుతుంది. ఒక్కోసారి మైనస్ అవుతుంది. ఇక ప్ల‌స్ అంటే..ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబ‌ట్టి ఏక్టింగ్ అనుకుంటున్నాను.

సౌఖ్యం లో ఉన్న హైలెట్ ఏమిటి..?

ఈ సినిమాలో ఉన్న కామెడీ, స్ర్కీన్ ప్లే సినిమాకి హైలెట్ అనుకుంటున్నాను.

మీరు ఆశించిన ఆఫ‌ర్స్ రావ‌డం లేద‌నే ఫీలింగ్ ఏదైనా ఉందా..?

నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదండి. స్లో అండ్ స్టడీగా వెళుతున్నాను. నేను ఆశించిన ఆఫ‌ర్స్ వ‌స్తాయ‌ని పూర్తి న‌మ్మ‌కం ఉంది.

మీకు పోటీ ఎవ‌ర‌నుకుంటున్నారు..?

అంద‌రూ నాకు పోటీ అనే అనుకుంటాను. ఎవ‌రో ఒక్క‌రే నాకు పోటీ అనుకోను.

తెలుగు, త‌మిళ్ మూవీస్ చేస్తున్నారు క‌దా..? ఈ రెండు ఇండ‌స్ట్రీస్ లో వ‌ర్క్ చేయ‌డం ఎలా ఉంది..?

త‌మిళ్..నేను అక్క‌డే పుట్టి పెరిగాను. త‌మిళ్ నుంచి తెలుగుకి వ‌చ్చాను. తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. త‌మిళ్‌, తెలుగు ఈ రెండు ఇండ‌స్ట్రీస్ నాకు చాలా ఇష్టం.

మీ డ్రీమ్ రోల్ ఏమిటి..?

ఇప్ప‌టి వ‌ర‌కు మంచి సినిమాల్లో మంచి పాత్ర‌లు పోషించాను. ఇలాగే మ‌రెన్ని మంచి సినిమాల్లో మంచి పాత్ర‌లు పోషించాలి అనుకుంటున్నాను. అంతే కానీ...ప్ర‌త్యేకించి ఇలాంటి రోల్ ఒక‌టి చేయాలి అనే ఏమీ లేదు.

More News

డిసెంబర్ 27న 'నాన్నకు ప్రేమతో..' ఆడియో

యంగ్ టైగర్ ఎన్టీఆర్,ఆర్య సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'.

సౌఖ్యం మూవీ రివ్యూ

సౌఖ్యం అనే మాటను వింటుంటే మనసుకు సుఖంగా ఉంటుంది. అహర్నిశలూ వ్యక్తి పాటుపడేది సౌఖ్యంగా జీవించడానికే. కుటుంబం సౌఖ్యంగా ఉండాలి. కుటుంబంతో పాటు ఇరుగూపొరుగూ కూడా సౌఖ్యంగా ఉండాలనుకునే హీరో కేరక్టరైజేషన్ తో అల్లుకున్న కథే 'సౌఖ్యం' అని చిత్ర యూనిట్ పలు సందర్భాల్లో చెప్పింది.

చెక్ పెట్టిన శ్రద్దా...

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం డిక్టేటర్.ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

బాలీవుడ్ వెళుతున్న లోఫర్...

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం లోఫర్.వరుణ్ తేజ్,దిషా పాట్ని జంటగా నటించిన లోఫర్ ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

సౌఖ్యం కథ మామూలుగానే ఉంటుంది...కానీ కథనం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. - డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి

మనసుతో చిత్రంతో దర్శకుడిగా పరిచయమై...యజ్నం సినిమాతో సక్సెస్ సాధించి తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరుచుకున్న డైరెక్టర్ ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి.