నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదండి..ఆవిషయంలో పూర్తి నమ్మకం ఉంది - హీరోయిన్ రెజీనా
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్.ఎం.ఎస్, రొటీన్ లవ్ స్టోరి, రారా క్రిష్ణయ్య, కొత్త జంట, పవర్, పిల్లా నువ్వులేని జీవితం...తదితర చిత్రాలతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న హీరోయిన్ రెజీనా. తాజాగా రెజీనా గోపీచంద్ సరసన నటించిన చిత్రం సౌఖ్యం. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తెరకెక్కించిన సౌఖ్యం ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా సౌఖ్యం గురించి రెజీనాతో ఇంటర్ వ్యూ మీకోసం...
సౌఖ్యం సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి గారు...తన సినిమాలో ఏదో ఒక ప్రాబ్లమ్ చూపిస్తారు. అలాగే ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తారు. పిల్లా నువ్వులేని జీవితం లో నా క్యారెక్టర్ ఎలా ఉందో...ఇంచుమించు సౌఖ్యం లో కూడా అలా ఉంటుంది. కాకపోతే ఆ సినిమాలో ఉన్నంత సీరియస్ గా ఈ సినిమాలో ఉండను. నా పాత్ర అందరికీ నచ్చేలా ఉంటుంది.
డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరితో సెకండ్ టైమ్ వర్క్ చేసారు. ఆయన వర్కింగ్ స్టైల్ గురించి..?
ఆయన ఆర్టిస్ట్ లకు ఫ్రీడమ్ ఇస్తారు. ముందు సీన్ గురించి చెప్పి ఆతర్వాత మీరు ఎలా యాక్ట్ చేస్తారో చెయ్యండి అంటారు. ఆర్టిస్ట్ లు నుంచి తనకు కావాలసిన విధంగా నటనను రాబట్టుకుంటారు. రవి కుమార్ చౌదరి గారితో సెకండ్ టైమ్ వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
గోపీచంద్ తో ఫస్ట్ టైం వర్క్ చేసారు కదా..? సెట్స్ లో గోపీచంద్ ఎలా ఉండేవారు..?
అవును...గోపీచంద్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేసాను. సెట్స్ లో చాలా సైలెంట్ గా ఉంటారు. ఒక్కసారి కెమెరా ఆన్ అయ్యిందంటే ఏసీన్ అయినా సరే సింపుల్ గా చేసేస్తారు. అలాగే...సీన్ ను ఇంకా బెటర్ గా ఎలా చేయచ్చు అని డైరెక్టర్ తో డిష్కస్ చేస్తారు. నిజంగా గోపీచంద్ గారితో వర్క్ చేయడం మరచిపోలేని అనుభూతి.
గోపీచంద్ లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ ఏమిటి..?
తను ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది..? ఎలాంటి క్యారెక్టర్స్ బాగోవు..అనే విషయం పై పూర్తి అవగాహన ఉంది. అది ప్లస్ అనుకుంటే...ఆయన ఎవరితో ఎక్కువుగా మాట్లాడరు సైలెంట్ గా ఉంటారు అది మైనస్ అనుకుంటున్నాను.
గోపీచంద్ ప్లస్ అండ్ మైనస్ చెప్పారు..మరి..మీ గురించి అడిగితే..?
నాలో ఉన్న మైనస్ అంటే నేను చాలా ఎక్కువుగా మాట్లాడతాను. అది ఒక్కసారి ప్లస్ అవుతుంది. ఒక్కోసారి మైనస్ అవుతుంది. ఇక ప్లస్ అంటే..ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఏక్టింగ్ అనుకుంటున్నాను.
సౌఖ్యం లో ఉన్న హైలెట్ ఏమిటి..?
ఈ సినిమాలో ఉన్న కామెడీ, స్ర్కీన్ ప్లే సినిమాకి హైలెట్ అనుకుంటున్నాను.
మీరు ఆశించిన ఆఫర్స్ రావడం లేదనే ఫీలింగ్ ఏదైనా ఉందా..?
నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదండి. స్లో అండ్ స్టడీగా వెళుతున్నాను. నేను ఆశించిన ఆఫర్స్ వస్తాయని పూర్తి నమ్మకం ఉంది.
మీకు పోటీ ఎవరనుకుంటున్నారు..?
అందరూ నాకు పోటీ అనే అనుకుంటాను. ఎవరో ఒక్కరే నాకు పోటీ అనుకోను.
తెలుగు, తమిళ్ మూవీస్ చేస్తున్నారు కదా..? ఈ రెండు ఇండస్ట్రీస్ లో వర్క్ చేయడం ఎలా ఉంది..?
తమిళ్..నేను అక్కడే పుట్టి పెరిగాను. తమిళ్ నుంచి తెలుగుకి వచ్చాను. తెలుగు ఇండస్ట్రీలో ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. తమిళ్, తెలుగు ఈ రెండు ఇండస్ట్రీస్ నాకు చాలా ఇష్టం.
మీ డ్రీమ్ రోల్ ఏమిటి..?
ఇప్పటి వరకు మంచి సినిమాల్లో మంచి పాత్రలు పోషించాను. ఇలాగే మరెన్ని మంచి సినిమాల్లో మంచి పాత్రలు పోషించాలి అనుకుంటున్నాను. అంతే కానీ...ప్రత్యేకించి ఇలాంటి రోల్ ఒకటి చేయాలి అనే ఏమీ లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments