ఆయ‌న వ‌ల్ల నాకు స్ట్రెంగ్త్‌ పెరిగింది- ప్రియాంక జ‌వాల్క‌ర్‌

  • IndiaGlitz, [Tuesday,November 13 2018]

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తోన్న చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమా నవంబర్‌ 17న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ మీడియాతో ముచ్చ‌టించారు...

మీ గురించి చెప్పండి?

నా పేరు ప్రియాంక‌. టాక్సీవాలా మూవీలో డెబ్యూ చేస్తున్నాను. బేసిక‌ల్లీ నేను మ‌రాఠీ అమ్మాయిని తెలుగు నేర్చుకున్నాను.

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌గారు ప్రీరిలీజ్‌లో మిమ్మ‌ల్ని అనంత‌పురం అమ్మాయి అన్నారు ఎలా ఫీల‌య్యారు?

హ్యాపీ ఫీల‌య్యా. అనంత‌పురం నుంచి ఎవ‌రూ లేరు క‌దా అందుకే సెట్‌లో వాళ్ళు అలా ఫీల‌వుతున్న‌ట్లున్నారు.

ఆఫ‌ర్ ఎలా వ‌చ్చింది?

నేను 2016లో యాక్టింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను బిక్షుగారి ద‌గ్గ‌ర‌. బిక్షుగారు, వాళ్ళ వైఫ్ వాళ్ళు యాక్టింగ్ ఇంట్లోనే నేర్పించేవారు వాళ్ళ ద‌గ్గ‌ర నేర్చుకున్నాను. నాలుగు నెల‌లు కోచింగ్ తీసుకున్న త‌ర్వాత నా పిక్చ‌ర్స్ గీతాఆర్ట్స్‌కి పంపించాను. అప్పుడు వాళ్ళు న‌న్ను పిలిపించి 2,3 సినిమాలు ఉన్నాయి ఆడిష‌న్ ఇవ్వండి ఎందులో బావుంటే అందులో దేనికి సెట్ అయితే దానికి తీసుకుంటాం అన్నారు.

ఇంత‌క ముందు ఏమి చేశారు?

షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అవి చేసి ఐదు ఏళ్ళు అవుతుంది. అందులో పొసెసివ్‌నెస్ అనే షార్ట్ ఫిల్మ్ బాగా వైర‌ల్ అయింది. ఎం.ఆర్ ప్రొడ‌క్ష‌న్‌లో చేశాను. చిన్న‌ప్ప‌టినుంచి యాక్టింగ్ అంటే ఇష్టం బ‌ట్ పేరెంట్స్ చ‌దువుకోవాలి చ‌దువుకుంటే లైఫ్ బావుంట‌ది అనేవాళ్ళు అదే ఇది మీద ఉండేదాన్ని. నేను ఇంజ‌నీరింగ్ ఫైన‌లియ‌ర్ చేస్తున్న‌ప్పుడు ఒక ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి ఒక ఫోన్ వ‌చ్చింది సో అండ్ సో షార్ట్ ఫిల్మ్స్ అని సో అప్ప‌టికి నేనే వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూశాను. రాజ్‌త‌రుణ్‌,చాందిని చౌద‌రి వీళ్ళంద‌రూ చేశారు అందులో. చూసిన త‌ర్వాత బానే అనిపించి సో క్యాజువ‌ల్‌గా ట్రై చేద్దామ‌ని చేశాను.

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించ‌డం ఎలా అనిపించింది?

విజ‌య్‌తో చెయ్య‌డం బావుంది. చాలా కూల్ ప‌ర్స‌న్‌. త‌ను చాలా మంచి పెర్‌ఫార్మ‌ర్ యాక్టింగ్ బేసిస్‌ ఆయ‌న వ‌ల్ల నాకు యాక్టింగ్ స్కిల్స్‌ పెరిగాయి. ఒక సీన్ ని ఎన్నిసార్లు ఎన‌లైజ్ చేసుకోవాలి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నీ చెప్పేవారు.

మీరు ఏం చ‌దువుకున్నారు ఎలా ఇటు వైపు వ‌చ్చారు?

బేసిక‌ల్లీ నేనే ఇంజ‌నీరింగ్ కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివాను. త‌ర్వాత హైద‌రాబాద్‌లో ఫ్యాష‌న్ క్లోతింగ్ మ‌రియు టెక్నాల‌జీ చేశాను. నిఫ్ట్‌లో డిప్ల‌మా చేశాను. అది ఒక సంవ‌త్స‌రం కోర్స్‌ఆ టైంలో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ త‌ర్వాత కంప్లీట్ ఒక సంవ‌త్స‌రం గ్యాప్ వ‌చ్చింది. ఫ్యాష‌న్‌లో మాస్ట‌ర్స్ కూడా చేద్దామ‌నుకున్నా కానీ నాకు డైటా అన‌ల‌టిక్స్‌ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నేను అది అటెండ్ చేశాను కాని ఫ‌స్ట్ టైం స్కోర్ చెయ్య‌లేక‌పోయా మ‌ళ్ళీ సెకండ్ టైం ఆరు నెల‌లు ట్రైనింగ్ తీసుకుని బాగా ప్రిపేర్ అయ్యా మంచి స్కోర్ వ‌చ్చింది. అన్నీ డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ ప్రొఫైల్స్ కావ‌డంతో 8 నెల‌లు పాటు స్టాట‌స్టిక్ కోర్స్ కూడా చేశాను.

ఈ సినిమా బ్యాన‌ర్ చూసి ఒప్పుకున్నారా?

డెబ్యూ మూవీకి బ్యాన‌ర్ చూసుకోవ‌డ‌మేంటండి. ఆఫ‌ర్ రావ‌డ‌మే గొప్ప ఫ‌స్ట్ ఆఫ‌ర్ కోసం ఎవ‌రైన ఎదురు చూస్తాం క‌దా. చాలా మంది ఇదే అడుగుతున్నారు. సెకండ్ మూవీకి అవ‌న్నీ చూస్తానేమోకాని ఫ‌స్ట్ మూవీ ముందు నాకు చాన్స్ కావాలి క‌దా.

అంద‌రూ మిమ్మ‌ల్ని తెలుగమ్మాయి అంటున్నారు? ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది వ‌చ్చినా అంత‌గా క్లిక్ అవ్వ‌లేదు? మ‌ఈరు ఏవిధంగా క్లిక్ అవ్వ‌గ‌ల‌ను అనుకుంటున్నారు?

బేసిక‌ల్లీ న‌న్ను ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్‌తో కంపేర్ చేస్తే చాలా డిఫ‌రెన్స్ ఉంట‌ది. వాళ్ళు ఆల్ర‌డీ ఎక్స‌పీరియ‌న్స్ ఎలా చెయ్యాలి ఎలా మాట్లాడాలి అన్నీ వాళ్ళ‌కు తెలుసు నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. ప్ర‌జ‌ర్ అనిపించ‌డంలేదు కాని ఆర్ట్ ఈజ్ ఆర్ట్ ఒక పెయింటింగ్ ఉందంటే దాన్ని త‌మిళ ఆర్టిస్ట్ వేసిన తెలుగు ఆర్టిస్ట్ వేసిన ఆర్ట్ ఆర్టే క‌దా యాక్టింగ్ కూడా అంతే నాకు సంబంధించినంత వ‌ర‌కు. ఎవ‌రు చేసిన అవుట్ పుట్ అనేది బావుండాలి. బ‌ట్ తెలుగ‌మ్మాయిలు ఎక్కువ వ‌స్తే బావుంటుంది. డైరెక్ట‌ర్‌కి కూడా ఒక అవ‌గాహ‌న ఉంటుంది క‌దా ఎవ‌రు క్యారెక్ట‌ర్‌కి బాగా ఫిట్ అవుతారు కాదు అన్న‌ది. అలాగే ప్ర‌స్తుతం హీరోయిన్లు అంద‌రూ కూడా ఎవ‌రి డ‌బ్బింగ్ వాళ్ళే చెప్పేసుకుంటున్నారు. లాంగ్వేజ్ ప్రాబ్ల‌మ్ కూడా ఏమీ లేదు. డెఫ‌నెట్లీ తెలుగ‌మ్మాయిగా డెబ్యూ చేస్తున్నాను నాకు తెలియ‌దు ఇక్క‌డ జ‌ర్నీ ఎలా ఉండ‌బోతుంది అన్న‌ది.

తెలుగ‌మ్మాయిల‌కు డిస్ ఎడ్వాంటేజ్‌లు ఏంటి మీకు తెలిసి?

హ.. హ... హ.. హైద‌రాబాద్‌లో ఉండ‌డం. బాంబే నుంచి వ‌స్తే బావుంట‌దేమో అదే డిస్ ఎడ్వాంటేజ్ అనుకుంట‌.

విజ‌య్‌దేవ‌ర‌కొండ స‌పోర్ట్ సెట్‌లో ఎలా ఉండేది?
ఆన్‌సెట్‌లో చాలా బాగా ఉండేది. త‌న‌కు తెలుసు క‌దా నాకు ఇది ఫ‌స్ట్ మూవీ అని. ఒక సీన్ నాకు రాక‌పోయినా త‌ను యాక్ట్ చేసి చూపించేవారు ఇలా చెయొచ్చు అలా చెయ్య‌చ్చు అని. నాకు క‌నీసం థాట్ కూడా వ‌చ్చేది కాదు నేను ఒక‌రంకంగా అనుకునేదాన్ని ఆయ‌న దానికి వేరే చాలా యాడ్‌చేసి చూపించేవారు. సో అలా నాకు బాగా హెల్ప్ అయింది.

అవ‌కాశం వ‌చ్చిన త‌ర్వాత పేరెంట్స్ కి ఎలా చెప్పారు? ఏమ‌న్నారు?

నేను ముందుగానే ఎవ‌రికీ చెప్ప‌లేదండీ. ఎందుకంటే ఒన్ వీక్ త‌ర్వాత మ‌ళ్ళీ తీసేస్తారేమో అని చిన్న టెన్ష‌న్ ఉండేది. ఎక్క‌డ న‌న్ను తీసేస్తారో ఇంట్లో చెప్పుకుంటే నేను ఎక్క‌డ బిస్కెట్ అయిపోతానో అని చాలా భ‌యం ఉండేది అందుకే చెప్ప‌లేదు.రెండు మూడు వారాలు అయిన త‌ర్వాత న‌న్ను తియ్య‌రు అని నాకు న‌మ్మ‌కం వ‌చ్చిన త‌ర్వాత చెప్పాను. మా అమ్మ‌కి చెప్పా అవ‌కాశం వ‌చ్చింది అని అప్పుడు అవునామ్మా మంచిది. జాగ్ర‌త్త‌గా చెయి మంచిగా యాక్ట్ చెయ్యి అంది.

చ‌దువుకుంటున్న టైంలో మ‌ళ్ళీ యాక్టింగ్ వైపుకు ఎందుకు వ‌చ్చారు?

యాక్టింగ్ అంటే చిన్న‌ప్ప‌టి నుంచి ఇష్టం. ఎవ‌రికైనా చెపితే ఏమంటారు పిచ్చి ప‌ట్టిందా యాక్టింగ్ ఎందుకు చ‌క్క‌గా చ‌వుదువుకుని జాబ్ చేసుకోక అంటారు. రీస్కీ కెరియ‌ర్ అంటారు. ఒక‌సారి అమెరికా వెళ్ళిన‌ప్పుడు అక్క‌డ తెలుగువాళ్ళు న‌న్ను గుర్తుప‌ట్టి మీరు షార్ట ఫిల్మ్‌లో చేశారు క‌దా అన్నారు. దాంతో నాకు మ‌ళ్ళీ నేను ట్రై చేసి ఉంటే బావుండేదేమో అనిపించింది. ట్రై చేసి నా పేరెంట్స్‌ని క‌న్పిన్స్ చేద్దామ‌నుకున్నా. ఒక సంవ‌త్స‌రం పాటు ట్రై చేద్దాం అవ‌కాశం రాక‌పోతే వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆరు నెల‌ల‌కే ఇది ఓకే అయింది. కాక‌పోతే రిలీజ్ అవ్వ‌డానికి రెండేళ్ళు ప‌ట్టింది.

ఈ రెండేళ్ళ‌లో మీకు వేరే అవ‌కాశాలు రాలేదా?

అంటే మా టీమ్ అంద‌రి న‌మ్మ‌క‌మేంటంటే ఇది చాలా మంచి స్టోరీ వ‌ర్కౌట్ అవుతుంది. ఎందుకు ఆవేశ‌ప‌డి వేరే వాటికి సైన్ చెయ్య‌డం అని ఆగాను. యాక్టువ‌ల్‌గా వాళ్ళ‌కు కూడా తెలియ‌దు ఇంత టైం ప‌డుతుంద‌ని. ఆఫ‌ర్స్ వ‌చ్చాయి కాని నేను ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో రాలేదు. బ‌హుశా ఈ సినిమా విడుద‌ల‌య్యాక వ‌స్తాయేమో. ఒక డైరెక్ట‌ర్ కూడా ఒక హీరోయిన్‌ను తీసుకోవాలంటే స్క్రీన్ మీద ఎలా ఉన్నాము, మార్కెట్ వాల్యూ ఇవ‌న్నీ కూడా చూస్తారు క‌దా.

ఈ సినిమాలో క్యారెక్ట‌ర్ గురించి?

ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ పేరు అను. జూనియ‌ర్ డాక్ట‌ర్ రోల్ లో చేశాను.

ఫ‌స్ట్ సినిమా రిలీజ్‌కి ఇంత గ్యాప్ వ‌చ్చింది ఎలా ఫీల‌య్యారు?

చాలా భ‌య‌మేసింది. ఒక్కోసారి అన‌వ‌స‌రంగా ట్రై చేశానా అని కూడా అనుకున్నాను. మంచిగా చ‌దువుకునేదాన్ని అవ‌స‌ర‌మా మ‌న‌కిది అని అనుకునేదాన్ని. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయి హిట్ అయితే నాకు లైఫ్‌లో ఇదే కావాలి అనిపిస్త‌ది. ఎవ‌రికైనా కామ‌న్ క‌దా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మార‌డం అనేది.

ప్రీరిలీజ్‌లోనే బ‌న్నీ గారిని క‌లిశారా ఇంత‌కు ముందే క‌లిశారా?

నేను టెస్ట్ ఇచ్చేట‌ప్పుడు ఒక్క‌సారి వ‌చ్చి ఆల్ ద బెస్ట్ చెప్పివెళ్లారు అంతే ఒక్క‌సారి. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ రెండేళ్ళు క‌ల‌వ‌లేదు.

ఆయ‌న పైన క్ర‌ష్ ఉంద‌న్నారు? ఎప్పుడు మీట్ అయ్యాక‌?

ఫ‌స్ట్ టైం మీట్ అయ్యాక క్ర‌ష్ ఫామ్ అయింది. ఆయ‌న చూసి వెళ్లిపోయాక అనిపించింది.

ఫ‌స్ట్ టైం స్టేజ్ షేరింగ్ బ‌న్నీతో ఎలా అనిపించింది?

స్టేజ్ మాత్ర‌మే క‌దండి.... స్ర్కీన్ కాదుక‌దా షేర్ చేసుకుంది. చాలా సార్లు ఆ పిక్స్ చూసుకున్న సో నైస్ సో నైస్ అనుకున్నా.

రాహుల్ డైరెక్ట‌ర్ గురించి చెప్పండి?

రాహుల్ ఆయ‌న ప‌ర్ఫెక్ష‌న్‌కి నేను ఎక్కువ బ‌ల‌య్యాను. ప్ర‌తీ చిన్నది కూడా ప‌ర్ఫెక్ట్‌గా కావాలంటారు ఆయ‌న‌. కానీ ఎప్పుడూఒక్క‌రోజు కూడా టెంప‌ర్‌గా లేరు చాలా కూల్‌గా ఉండేవారు కూల్‌గా చెప్పేవారు. టైంఇస్తూ, స్పేస్ ఇస్తూ, డైలాగ్స్ అన్నీ ముందురోజే చెపుతూ చెయించుకునేవారు.

మీకు ఫ్యూచ‌ర్‌లో చెయ్యాల‌నిపించే జోన‌ర్ ఏదైనా ఉందా?

అలా ఏమీ లేదండి. ప్ర‌స్తుతం అవ‌కాశాలు రావాలి మొయిన్ అంతే. ఏదైనా స‌రే ఒక మంచి సినిమాలో పార్ట్ అయితే చాలు.పెద్ద హీరోయిన్ ఓరియంటెడ్ చెయ్యాలి అనేమి లేదు. నేను ఏ సినిమాలో ఉన్నా ఆ సినిమా జ‌నాల‌కి న‌చ్చితే అదే చాలు.

More News

'లా' మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుంది - అంబికా కృష్ణ

కమల్ కామరాజు,మౌర్యాణి, పూజా రామచంద్రన్ లీడ్ రోల్స్  ప్లే చేసిన మూవీ 'లా' (లవ్ అండ్ వార్). గగన్ గోపాల్ ముల్కా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని శ్రీ విఘ్నేశ్వర ఫిలింస్ బ్యానర్ మీద

'సైరా నరసింహారెడ్డి' మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది లైవ్‌ కాన్సర్ట్‌

ప్ర‌ముఖ బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది నవంబ‌ర్ 24న తొలిసారి హైద‌రాబాద్‌లో మ్యూజిక్ లైవ్ ప్రోగ్రామ్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.

'న‌ట‌న' ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

భ‌విరి శెట్టి వీరాంజ‌నేయులు, రాజ్య‌ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌.. గురుచ‌ర‌ణ్ నిర్మాణ సార‌థ్యంలో కుభేర ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హిధ‌ర్‌, శ్రావ్యారావు హీరో హీరోయిన్‌గా న‌టించిన చిత్రం 'న‌ట‌న‌'.

పార్టీ మూవీ ఆడియో లాంచ్‌

అమ్మ క్రియేష‌న్స్ ప‌తాకం పై టి. శివ నిర్మించిన‌ చిత్రం పార్టీ. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జై, రెజీనా క‌సాంద్రా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్‌

బాబాయ్ ప్లేస్ లో అబ్బాయ్‌

బాబాయ్ నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న తండ్రి.. దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'ను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే.