ఓటమికి బాధ్యత వహిస్తా: హరీష్ రావు

దుబ్బాక ఉపఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకూ మంత్రి హరీష్‌రావు చాలా కృషి చేశారు. దుబ్బాకలోనే మకాం వేసి తమ పార్టీ గెలుపునకు పాటుపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత విజయానికి శాయశక్తులా ప్రయత్నించారు. దుబ్బాకలోనే మకాం వేసి ప్రతి క్షణం టీఆర్ఎస్ గెలుపు కోసం పని చేశారు కానీ విజయం మాత్రం బీజేపీని వరించింది. దీనిపై తాజాగా హరీష్ రావు స్పందించారు.

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. దుబ్బాక ప్రజల తీర్పును శిరసావహిస్తామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుని.. తమ లోపాలను సవరించుకుంటామని తెలిపారు. దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటు పడతామని.. ప్రజలకు అందుబాటులో ఉంటామని హరీష్ రావు వెల్లడించారు.

ఎన్నికల్లో కష్ట పడిన ప్రతి ఒక్క కార్యకర్తకు హరీష్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి పాలైనప్పటికీ దుబ్బాక ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన, తన పక్షాన కష్ట సుఖాల్లో ప్రజలకు తోడుంటామని తెలిపారు. ప్రజా సేవలో నిరంతరం పాటు పడతామని.. దుబ్బాక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని హరీష్‌రావు వెల్లడించారు.

More News

ఆ విష‌యం తెలిసి షాక‌య్యాను:  ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ప్ర‌మాదం పొంచి ఉంది కాబ‌ట్టి ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉంటూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాంటూ విజ్జ‌ప్తి చేశారు.

బాల‌య్య హీరోయిన్ ఖ‌రారు

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రంలో ఆయ‌న స‌ర‌స‌న న‌టించ‌బోయే హీరోయిన్ ఖ‌రారైంది.

దుబ్బాకను సొంతం చేసుకుని.. టీఆర్ఎస్‌ను చావుదెబ్బ కొట్టిన బీజేపీ

దుబ్బాక ఉపఎన్నిక.. ఆసక్తికరంగా మొదలైన కౌంటింగ్.. నరాలు తెగే ఉత్కంఠ..  రౌండ్ రౌండ్‌కూ మారిపోయిన ఆధిక్యాలు..

దుబ్బాక దంగల్‌లో హరీష్‌రావు, ఉత్తమ్‌, సీతక్కలకు షాక్..

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 10 రౌండ్ల వరకూ బీజేపీ దాదాపుగా హవా కొనసాగిస్తూ వచ్చింది.

దుబ్బాక: 2009 నుంచి ఎన్నికల ఫలితాలు ఆసక్తికరమే..

దుబ్బాక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి నేటి ఉప ఎన్నిక వరకూ ఆసక్తికరంగా మారుతూనే ఉన్నాయి.