అజిత్ తో చేయడానికి నేను సిద్ధం- పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Monday,July 11 2016]

పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు లండ‌న్ ట్రిప్ నుండి మ‌లేషియాకు చేరుకున్నాడు. అక్క‌డ ఫ్యాన్స్ చిట్ చాట్ చేశాడు. అక్క‌డ ఉన్న ఓ అభిమాని త‌మిళంలో పెద్ద స్టార్ హీరో అయిన అజిత్ తో క‌లిసి మీరు న‌టిస్తే చూడాల‌నుంద‌ని, ఎప్పుడు న‌టిస్తార‌ని అడిగారు. అందుకు ముందు న‌వ్వేసిన ప‌వ‌ర్‌స్టార్‌. అవ‌కాశం వ‌స్తే క‌చ్చితంగా అజిత్‌తో క‌లిసి న‌టించడానికి తాను సిద్ధ‌మేన‌న్నాడు. త‌మిళ‌నాట అజిత్‌కు ఉన్న ఫ్యాన్‌ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు ప‌వ‌న్ చేస్తున్న సినిమా కూడా అజిత్ న‌టించిన వేదాళం పాయింట్‌తోనే ఉంటుంద‌ని టాక్‌. మ‌రి రెండు సినిమాల్లో న‌టించి సినిమాల నుండి త‌ప్పుకోవాల‌నుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అజిత్ తో న‌టిస్తాడంటారా..ఏమో ఎప్పుడు ఏ ట‌ర్న్ తీసుకుంటారో....