KTR:జైలుకు వెళ్లడానికి నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా..? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌తో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే ముందుకురా.. మీరు సోషల్ మీడియాలో పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది ఫోర్జరి.. ఏది డూప్లికేట్ అనేది తేలుద్దాం అన్నారు.
నిజానిజాలు తేల్చిన తర్వాత తప్పు తమదే అయితే తాను జైలుకు వెళ్తానని.. మీది తప్పు అయితే మీరు జైలుకు వెళ్లడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఇకనైనా బుద్ది, సిగ్గు తెచ్చుకొని వెంటనే క్రిశాంక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేయని తప్పుకు క్రిశాంక్‌ను అన్యాయంగా జైల్లో వేశారని విమర్శించారు.. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
కాగా ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్లు, కరెంట్ బంద్ అయిన కారణంగా నెల రోజుల పాటు సెలవులు ఇచ్చారంటూ ఓ సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సర్క్యులర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందుకు పోస్ట్ చేసింది. దీంతో గతేడాది జారీచేసిన సర్క్యూలర్‌కు బదులుగా ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేసి ఓయూ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని క్రిశాంక్ షాంక్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఓయూ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ రావు పోలీసులకు ఫిర్యాదుచసచేశారు. ఈ నేపథ్యంలో మే 1వ తేదిన సూర్యాపేట టోల్ గేట్ వద్ద క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలులో ఉంటున్నారు. క్రిశాంక్ అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments