మీరు సై అంటే నేను రెండు సార్లు ‘సై’.. కిందపడేసి కొడతాం!
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్‌పై బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద జనసేన పోరాటయాత్ర సభా వేదికగా పవన్ రియాక్ట్ అయ్యారు. "భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నా గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాల్లో నేర్చుకుంటే మంచిది అన్నారు. చిత్తూరు నుంచి ఆయనకు ఒకటే చెబుతున్నాను. ఎక్కడ తగ్గాలో తెలియకుండా ఇంతదూరం రాలేదు. అవసరం అయితే ఎక్కడ పెరగాలో కూడా తెలుసు.
నా మీద ఎక్కి తొక్కుతాం అంటే మాత్రం కిందపడేసి కొడతాం. నా దేశభక్తి గురించి తెలియాలంటే మీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అడగండి. చట్టసభల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు కనుకే భారతీయ జనతా పార్టీతో విబేధించాను. ప్రత్యేక ప్యాకేజీ పేరు చెప్పి సహజంగా రావాల్సిన ఫండ్సే ఇస్తే తెలుగుదేశం పార్టీ అడగలేకపోయారు. నేను ప్రశ్నించానని కోప్పడితే ఎలా..? భారతీయ జనతా పార్టీకేనా దేశభక్తి ఉండేది..? జనసేనకు లేదా..? సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలకు లేదా..? . ఆ అధికార ప్రతినిధికి చెబుతున్నా నోరు కొంచెం నియంత్రించుకోండి. వాక్ శుద్దిని పాటించేవాడిని, మీరు యుద్ధానికి సై అంటే నేను రెండు సార్లు సై అంటాను. మీ పార్టీ నాయకులంటే నాకు గౌరవం ఉంది కానీ నేను మీకు బానిసను కాను" అని బీజేపీ నేతకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments