Rashmika:నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. రష్మికకు రౌడీ బాయ్ విషెస్..

  • IndiaGlitz, [Friday,February 16 2024]

'పుష్ప', 'యానిమల్' సినిమాలతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న దేశవ్యాప్తంగా యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. తాజాగా ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న రష్మికకు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ ఇన్‌స్టా పోస్ట్ పెట్టాడు. దీంతో నెటిజన్లు కడా రష్మికకు అభినందనలు తెలియజేస్తున్నారు.

కాగా దేశంలోని వివిధ రంగాల్లో తమదైన ముద్రవేసిన 30 ఏళ్లలోపు యువతీయువకులతో ఫోర్బ్స్ పత్రిక ప్రతి ఏడాది ‘30 అండర్ 30’ జాబితాను విడుదలచేస్తుంది. ఈ ఏడాది ఆ జాబితాలో రష్మిక తొలి స్థానం దక్కించుకుంది. ఆమెతో పాటు మరో ముగ్గురు నటీమణులకు ఈ లిస్టులో చోటుదక్కింది. దీనిపై రష్మిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. మ్యాగజైన్ కవర్ ఫొటోను షేర్ చేసిన ఆమె తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పోస్టును విజయ్ దేవరకొండ కూడా షేర్ చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపాడు.

ఇదిలా ఉంటే రష్మిక, విజయ్‌ దేవరకొండ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో కలిసి నటించారు. దీంతో ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్తున్నారని.. ఇద్దరు ఒకేచోట ఉన్న కొన్ని ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అలాగే ఒకరి సినిమాపై ఒకరు విషెస్ కూడా చేసుకుంటారు. దీంతో వారి రిలేషన్ వార్తకు బలం చేకూరింది. ఈ క్రమంలోనే ఇటీవల వారికి నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య అలాంటిదేమి లేదని.. తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని రష్మిక క్లారిటీ ఇచ్చింది. ప్రతి రెండేళ్లకు ఓసారి మీడియాలో పెళ్లి వార్తలు వస్తుంటాయని వ్యాఖ్యానించింది.

ఇక వీరి సినిమాల విషయానికొస్తే 'ఫ్యామిలీ స్టార్' మూవీతో విజయ్.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడులైన టీజర్, పాటకు మంచి స్పందన వచ్చింది. తనకు 'గీతగోవిందం' లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో ఈ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంతోనూ మరో సినిమాకు కమిట్ అయ్యాడు. అలాగే రష్మిక కూడా 'పుష్ప2' సినిమాతో బిజీగా ఉంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలతో ఈ అమ్మడు బిజీగా ఉంది.

More News

Allu Arjun's Uncle:కాంగ్రెస్ పార్టీలోకి అల్లు అర్జున్ మామ.. ఎంపీగా పోటీ..?

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి బోల్తాపడిన గులాబీ పార్టీకి..

Women Cricketers:మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్ హెడ్‌కోచ్‌పై వేటు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే హెచ్‌సీఏ తాజాగా మహిళల క్రికెటర్లపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోంది.

Rajadhani Files:‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

‘రాజధాని ఫైల్స్‌’(Rajadhani Files) సినిమా విడుదలకు ఆటంకం తొలగిపోయింది. మూవీ రిలీజ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Pawan:కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం అలాగే కూలిపోతుంది: పవన్

కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం చివరికి కూలిపోతుంది అని జనసేనాని తెలిపారు. విజయవాడలో "విధ్వంసం"

ఎలక్టోరల్ బాండ్లతో రూ.16వేల కోట్ల విరాళాలు.. బీజేపీకి భారీ ఎదురుదెబ్బ..

రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు అందించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బాండ్లపై తీవ్ర చర్చ మొదలైంది.