నేను భయపడట్లే.. నిరూపిస్తే ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటా..!
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన విశ్వక్ సేన్.. ఇటీవల హైదరాబాదీ నేటివిటీతో ‘ఫలక్‌నుమా దాస్’లో మెరిసిన విషయం విదితమే. స్వీయ దర్శకత్వంలో ప్రతిభ చూపిస్తూ ఈ సినిమాలో హీరోగా నటించి మెప్పించారు. అయితే.. సినిమాలో బూతు డైలాగ్‌లు ఉంటే అదో గొప్ప అనుకున్నట్టుగా తీసిన ఈ సినిమాపై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే ఎవడి సినిమాకి ఆడే హీరో కాబట్టి తన సినిమా బాలేదన్నందుకు బూతులతో నోటికి పనిచెప్పి ఓ వీడియో చేసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశాడు విశ్వక్. అంతటితో ఆగని ఆయన హీరో విజయ దేవరకొండ ఫ్యాన్స్‌కు సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ వివాదంపై తాజాగా మీడియా ముందుకు వచ్చిన విశ్వక్ వివరణ ఇచ్చుకున్నాడు.
విశ్వక్ మాటల్లోనే...
ఫలక్ నుమా దాస్ హీరో విశ్వక్ సేన్ మీడియా సమావేశం
నేను నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడుతాను.
ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులో చివరి 6 నిమిషాల వీడియో వివాదాస్పదం చేస్తున్నారు. కొందరు పనిగట్టుగొని నా సినిమాపై వివాదం సృష్టిస్తున్నారు. రెండేళ్లు కష్టపడి ఎంతో శ్రమించి తీసిన సినిమాను విమర్శిస్తున్నారు. డబ్బులెక్కువై నేను ఈ సినిమా తీయలేదు. నా సినిమాలో మా కుటుంబం, స్నేహితుల డబ్బు ఉంది. 10 కోట్ల నష్టం వాటిల్లుతుందనే అలా మాట్లాడాల్సి వచ్చింది. అలా మాట్లాడటం తప్పే, క్షమించండి.. నేను రివ్యూ రైటర్ల గురించి అసభ్యంగా మాట్లడటం లేదు.
నా పోస్టర్లు చించాల్సిన అవసం ఏముంది..?. నేను ఎవరికి భయడటం లేదు. ఈవీకెండ్‌లో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రం నాదే. నేను రివ్యూ రైటర్లను తిట్టినట్లు నిరూపిస్తే పరిశ్రమ నుంచి వెళ్లిపోతా ను. నా సినిమాపై ఎందుకు అంత పగపడుతున్నారు. ప్రేక్షకులను తిట్టడానికి నాకు బుర్రలేదా..?. సినిమా హిట్ అయ్యిందని కళ్లు నెత్తికెక్కే టైపు కాదు. ప్రేక్షకులు నా సినిమాను బతికిస్తున్నారు" అని విశ్వక్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నవారికి వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసి అందులో బూతులతో రెచ్చిపోయాడు హీరో. కాగా ఈ వ్యవహారంపై ఇంతవరకూ విజయదేవరకొండ రియాక్ట్ అవ్వలేదు. అయితే దేవరకొండ ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com