నేను సమంతను కాను: నిహారిక
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్ తనయుడు వరుణ్‌తేజ్ తర్వాత ఆయన తనయ నిహారిక కొణిదెల ఒక మనసు సినిమాతో బుల్లితెర నుండి వెండితెరలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లోనూ హీరోయిన్గా నటించింది. ఏ సినిమా కూడా నిహారికకు మంచి పేరు తెచ్చి పెట్టలేదు. తర్వాత నిహారిక హీరోయిన్గా సినిమాలు చేయలేదు. పెద్దనాన్న చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ చిన్న పాత్రలో నిహారిక నటించింది. తర్వాత మరే సినిమాలో నటించలేదు. ఆచార్యలో నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. అయితే ప్రస్తుతం లాక్డౌన్ సమయంలోకొనసాగుతోన్న క్వారంటైన్ టైమ్‌లో యాంకర్ ప్రదీప్‌తో కలిసి నిహారిక లైవ్ చాట్ చేశారు. అందులో ఆమెను కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటిస్తారా? అని ప్రశ్నించారు. దానికి నిహారిక నేను సమంతను కాదు కాబట్టి.. పెళ్లి తర్వాత నటిస్తానా? లేదా? అని ముందే చెప్పలేను అంటూ సమాధాన మిచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి సహా ఆయన వారసులుగా డజను మంది హీరోలు సినిమాల్లో ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి మాత్రం నిహారిక. అసలు ఈమె ఎలాంటి సినిమాలు చేస్తుందో? అసలు సక్సెస్ అవుతుందో లేదోనని మెగా ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. అప్పటి వరకు వెబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన నిహారిక సినీ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత మెగా ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే మెగా కుటుంబం అండతో నిహారిక సినిమాల్లోకి అడుగు పెట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments