నేను పొగాకు ప్రమోట్ చేయలేదు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయరాదంటూ ఇటీవల నానక్‌రామ్ అనే అభిమాని ఆయన్ని కోరాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు విషయాన్ని తెలుసుకున్న అజయ్ దేవగణ్ స్పందిస్తూ ``నేను పొగాకును ప్రమోట్ చేయలేదు. ఇలాచీలను ఉపయోగించాం.
నా ఒప్పందం ప్రకారం అది పొగాకు కాదు. మరి కంపెనీ ఇలాచీని కాకుండా మరేదైనా అమ్మిందా? అనేది నాకు తెలియదు`` అన్నారు అజయ్ దేవగణ్. ఇక సినిమాలో పొగ తాగని వ్యక్తిలా నటించడంపై ఆయన మాట్లాడుతూ ``దేదేప్యార్ దే`లో పొగ తాగని వ్యక్తి పాత్ర నాది. అయితే కంపెనీలో నా పాత్ర పొగ త్రాగుతుంది. పాత్ర పరంగానే నటించాలి తప్పదు`` అని కూడా పేర్కొన్నారు.
రాజస్థాన్‌కు చెందిన నానక్‌రామ్ అనే వ్యక్తి పొగాకు వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడ్డాడు. తన అభిమాన నటుడు అజయ్‌దేవగణ్ కూడా పొగాకు ఉత్పత్తుల్లో నటించకూడదని కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments