‘మెగాస్టార్’ నేను కాదు.. ఆయన్ను ఎవరూ రీచ్ కాలేరు!
Send us your feedback to audioarticles@vaarta.com
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సినిమాకు సంబంధించిన పలు అప్డేట్స్ ఇచ్చిన చిత్రబృందం.. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన విషయం విదితమే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ముంబైలో ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులు పలు ప్రశ్నలు సంధించగా చిత్రబృందంతో పాటు చిరు సమాధానాలు సంధించారు.
సినిమా వాయిదా పడటానికి..!
"ఇది చరిత్ర మరచిపోయిన వీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథ. ఇలాంటి వీరుడి కథను మన దేశంలోని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనిపించిందని చిరు చెప్పుకొచ్చారు. ఒకటిన్నర దశాబ్దంగా సినిమా వాయిదా పడుతూనే వస్తోందన్నారు. అందుకు కారణం బడ్జెట్ పరిమితులేనని.. సురేందర్ రెడ్డి, చరణ్ ఈ సినిమాను చేయడానికి ముందు రావడంతో తన కల నేరవేరిందని చిరు చెప్పుకొచ్చారు.
అమితాబ్ బచ్చన్ గురించి..!?
‘అమితాబ్‌గారు నా రియల్ లైఫ్ మెంటర్. నాకు తెలిసినంత వరకు ఇండియాలో మెగాస్టార్ అంటే నేను కాదు.. అమితాబ్ బచ్చన్‌గారే. ఆయన దగ్గరకు కూడా ఎవరూ రీచ్ కాలేరు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఈ సినిమాలో నా గురువు పాత్రకు అమితాబ్ బచ్చన్‌గారైతే బావుంటుందని డైరెక్టర్ సురేందర్ రెడ్డి అన్నారు. అదొక స్పెషల్ క్యారెక్టర్. నేను ప్రయత్నిస్తానని చెప్పి.. ఆయనకు ఫోన్ చేయగానే .. ఏం కావాలని అడిగారు. ఇలా ‘సైరా’ సినిమా గురించి చెప్పాను. చరణ్ నిర్మిస్తున్న ఆ చిత్రంలో నా గురువు పాత్రలో మీరు నటించాలని, ఓ వారం రోజులు కాల్షీట్స్ కేటాయిస్తే చాలని అన్నాను. వెంటనే ఆయన అంగీకరించారు. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని చిరు చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments