నాకు కరోనా సోకలేదు.. ఆరోగ్యంగానే ఉన్నా: ప్రభు

  • IndiaGlitz, [Saturday,October 03 2020]

కరోనా కాలం నడుస్తోంది. మనకు తెలిసిన మనిషి కొద్ది రోజుల పాటు కనిపించలేదంటే ఖతం.. కరోనా వచ్చిందంటూ క్వారంటైన్‌లో ఉన్నాడంటూ ప్రచారం మొదలవుతోంది. సామాన్యులకే ఈ రేంజ్‌లో ప్రచారం ఉందంటే ఇక సెలబ్రిటీల గురించి చెప్పనక్కర్లేదు. కొద్ది రోజులు కనిపించలేదంటే.. పక్కా క్వారంటైన్‌లో ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు ప్రభు విషయంలోనూ ఇదే జరిగింది. ఒక ముఖ్యమైన సందర్భంలో ప్రభు కనిపించలేదు. దీంతో ప్రభుకి కరోనా పాజిటివ్ అంటూ ప్రచారం జోరందుకుంది. తాజాగా ఆయన నాకు కరోనా రాలేదని చెప్పుకోవాల్సి వచ్చింది.

అక్టోబర్ 1న ప్రభు తండ్రి, లెజెండరీ నటుడు శివాజీ గణేషన్ జయంతి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఓ స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవగా తండ్రి కార్యక్రమంలో ప్రభు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రభుకి కరోనా పాజిటివ్ అని అందుకే ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. పలువురు పోస్టులు పెట్టి మరీ ఈ ప్రచారం నిర్వహించారు.

దీనిపై ప్రభు స్పందించారు. తనకు కరోనా సోకలేదని.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ప్రభు వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని వెల్లడించారు. ఇటీవల తన కాలు బెణికిందని.. ఆ కారణంగానే తాను ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని ప్రభు వెల్లడించారు. దీంతో ప్రభుకి కరోనా సోకిందన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.

More News

క్వారంటైన్‌‌కు వెళ్లనున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం.. నెలాఖరులో షూటింగ్..!

కరోనా దెబ్బకు ఆగిపోయిన సినిమాలన్నీ క్రమక్రమంగా షూటింగ్ బాట పడుతున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పైనే ఉంది.

అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ వీక్షకులకు థ్రిల్ ఇస్తున్న 'జీ 5' ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్' ట్రైలర్

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్'‌.

ఏపీ సీఎం జగన్ మామ గంగిరెడ్డి మృతి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన మామ, వైఎస్ భారతిరెడ్డి తండ్రి అయిన ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు.

హైదరాబాద్‌లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి జనం పరుగులు..

హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. బోరబండలో భూమి కంపించింది. రాత్రి 8.45, 11.42 నిమిషాలకు రెండు సార్లు భూమి కంపించింది.

తీగల వంతెనపై సరికొత్త ఆంక్షలు.. రాత్రి 11 దాటితే బంద్..

హైదరాబాద్‌‌కు దుర్గం చెరువుపై తీగల వంతెన మరో ఐకాన్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే.