Srikanth: రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: హీరో శ్రీకాంత్

  • IndiaGlitz, [Monday,May 20 2024]

బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని హీరో శ్రీకాంత్ స్పష్టంచేశారు. దీనిపై ఆయ‌న స్వయంగా వివ‌ర‌ణ ఇస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుద‌ల చేశారు. ఇందులో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘నేను హైద‌రాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లిన‌ట్లు.. పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు నాకు చాలా మంది ఫోను చేస్తూ వున్నారు. వీడియో క్లిప్స్ కూడా చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవ‌టంతో నాకు సంబంధించిన వార్తల‌ను వారు రాయ‌లేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లాన‌ని వార్తలు వ‌చ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో స‌హా మా కుటుంబ స‌భ్యులంద‌రూ న‌వ్వుకున్నాం అని చెప్పారు

మొన్నమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లాన‌ని అన్నారు. ఇలాంటి వార్తలు రాసిన వాళ్లు తొంద‌ప‌డ‌టంలో త‌ప్పులేద‌నిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన‌ అత‌నెవ‌రో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది. ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. నేనే షాక‌య్యాను. ద‌య‌చేసి ఎవ‌రూ న‌మ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీల‌కు, ప‌బ్స్ వెళ్లే వ్యక్తిని కాను నేను. ఎప్పుడైనా బ‌ర్త్ డే పార్టీల‌కు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వ‌చ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియ‌దు. మీడియా మిత్రులు స‌హా ఎవ‌రూ న‌మ్మొద్దు. విష‌యం తెలుసుకోకుండా, చాలామంది సామాజిక మాధ్యమాల్లో 'రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ శ్రీకాంత్' అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడ‌నే మీరు పొర‌బ‌డి ఉంటార‌ని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. ద‌య‌చేసి త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మొద్దు’’ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు సీనియర్ నటి హేమ కూడా ఈ పార్టీలో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించారు. పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. నేను ఎక్కడకీ వెళ్లలేదు.. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఓ ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాను.. చిల్ అవుతున్నాను. నాపై వస్తున్న వార్తలను దయచేసి నమ్మకండి. అది ఫేక్‌ న్యూస్‌. అక్కడ ఎవరు ఉన్నారో నాకు అయితే తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను మాత్రం నమ్మకండి అంటూ హేమ కోరారు.

కాగా బెంగుళూరు శివారు ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ వాడినట్లు గుర్తించారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్‌, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.. అంతేకాకుండా పార్టీలో తెలుగు సీనీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్నట్లు గుర్తించారు.

More News

Vanga Geetha: మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ప్రేమ.. వంగా గీత వ్యాఖ్యలు వైరల్..

ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి చూపు నెలకొని ఉంది. నామినేషన్ల దగ్గర నుంచి ప్రచారం ముగిసే వరకూ తెలుగు రాష్ట్రాల్లో

ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. ప్రాజెక్ట్స్‌ అప్టేడ్స్..

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ నేడు 41వ ఏటలో అడుగుపెట్టారు. దీంతో తారక్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

జులైలో 'భారతీయుడు 2' విడుదల.. జూన్ 1న ఆడియో లాంఛ్

యూనివ‌ర్సల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్టర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కర‌న్ నిర్మిస్తోన్న

ఒంగోలులో అల్లరిమూకలపై కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే..?

ఏపీలో పోలింగ్ ముగిసినా కూడా ఎక్కడో చోట హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

రేవ్ పార్టీలో పట్టుబడ్డ తెలుగు నటీనటులు.. సంబంధం లేదంటున్న హేమ..

బెంగుళూరులో రేవ్ పార్టీని పోలీసులు భ‌గ్నం చేశారు. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు.