నేను నీలకంఠుడ్ని.. బెదిరించే వాళ్లను లెక్క చేయను!
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడిగా పేరుగాంచిన ప్రకాశ్ రాజ్ సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. కాగా.. గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం విదితమే. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యానంతరం ప్రకాష్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రకాష్‌కు భద్రత కల్పించారు. అయితే తాజాగా ఓ ప్రముఖ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బెదిరింపుల ప్రస్తావన వచ్చింది. మళ్లీ ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తున్నారా అనే ప్రశ్నకు ఆయన కింది విధంగా బదులిచ్చారు.
నేను నీలకంఠుడ్ని..
‘గతంలో నన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చేవి. అయితే నేను పిరికివాడ్ని కాదు. ఒకర్ని చంపేద్దామని భావించేవాళ్లు నా దృష్టిలో చచ్చిపోయిన వాళ్ల కిందే లెక్క. తమలోని మానవత్వాన్ని చంపేసుకుంటేనే ఎదుటివాళ్లను చంపగలరు. ఆ లెక్కన ఒకర్ని చంపాలనుకున్నవాళ్లు ఎప్పుడో చచ్చిపోయినట్టుగా నేను భావిస్తాను. ప్రస్తుతం నాకు బెదిరింపులు ఏమీ రాకపోయినా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తుంటారు. రోగులను ఓ డాక్టర్ ఎలా చూస్తాడో అలాంటి విమర్శకులను నేనూ అలాగే చూస్తాను. ఇటీవల నా కుమారుడి ఫొటో పోస్టు చేస్తే నీ మనవడా అని, ఎన్నో భార్య కొడుకు అని వెటకారం చేశారు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. వాళ్ల నాలుకల్లో ఉన్న విషం అలాంటిది. నేను నీలకంఠుడ్నని, అలాంటి విషపు వ్యాఖ్యలను జీర్ణించుకోగల సత్తా నాకు ఉంది’ అని ప్రకాష్ రాజ్ ఉద్ఘాటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout