నేను మాములు వ్యక్తిని కాదు.. సీఎంగా ప్రమాణం చేస్తా!
Send us your feedback to audioarticles@vaarta.com
"నేను మాములు వ్యక్తి కాదు..నా దగ్గర వేస్తే ఊరుకోను" అని వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు కైకలూరులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. త్వరలో సీఎంగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. రాజకీయాలు జగన్, చంద్రబాబులే చేస్తారా.. మాకు అక్కర్లేదా..? అన్నట్లుగా పవన్ చెప్పుకొచ్చారు. కొత్తతరం రాజకీయాలు తీసుకువస్తానని జనసేనాని అన్నారు.
తాటా తీస్తా..
"ఎంపీ విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తాను. విజయసాయి రెడ్డికి కైకలూరు నుండి చెబుతున్నాను నోటికొచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడితే భరించడానికి నేను మామూలు వ్యక్తిని కాదు. పులివెందుల వేషాలు నా దగ్గర వేస్తే ఊరుకోను. పేపర్, ఛానల్ ఉన్నాయని వైసీపీ పిచ్చి రాతలు రాస్తే తాటతీస్తా. హైదరాబాద్‌లో కూర్చుని కేసీఆర్ అనుమతితో వైసీపీ బి-ఫారాలు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఇచ్చాను. 2014లో టీడీపీ ఎంపీ మాగంటి బాబుని గెలిపిస్తే పార్లమెంటులో సోఫాలో పడుకోనుండటమే తప్ప చేసిందేమీ లేదు. ఈ ఎన్నికలలో యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చాము" అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ వ్యాఖ్యలపై వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout