CM KCR:అందుకే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నా: సీఎం కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
కామారెడ్డి నుంచి పోటీ చేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ తనను చాలా సార్లు కోరారని అందుకే పోటీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన అంతకుముందు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంతో తనకు పుట్టినప్పటి నుంచి అనుబంధం ఉందన్నారు. తన తల్లి పుట్టింది ఈ నియోజకవర్గంలోని కోనాపూర్గా పిలిచే పోసానిపల్లి గ్రామంలోనే అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో 45 రోజుల పాటు ఇక్కడ జలసౌధ ఉద్యమం చేశామని.. ఆ సమయంలో ఇక్కడి లాయర్లు చైతన్యం చూపారన్నారు.
బీఆర్ఎస్ పాలనలో కామారెడ్డిని జిల్లాగా చేయడంతో పాటు ఇక్కడికి మెడికల్ కాలేజీని తెచ్చామని వెల్లడించారు. తాను కామారెడ్డికి వస్తున్నానంటే తాను ఒక్కడినే రానని తన వెంబడి ఎన్నో వస్తాయన్నారు. ఇక్కడి పల్లె, పట్టణాల రూపురేఖలు మార్చే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం... తెలంగాణ ప్రజల కోసమని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెస్తామన్నారు. కామారెడ్డిని అద్భుత నియోజకవర్గంగా మార్చి చూపిస్తానన్నారు.
దేశ రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి ఇప్పటికీ రాలేదని.. ఏ దేశాల్లో ఆ పరిణతి వచ్చిందో.. ఆ దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తాయి.. పోతాయి. ప్రతి పార్టీ నుంచి ఒక అభ్యర్థి పోటీలో ఉంటారు.. అభ్యర్థుల గుణంతో పాటు అతని వెనుక ఉన్న పార్టీ ఎలాంటిదనేది కూడా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కాగా అంతకుముందు గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com