షాక్ నుంచి ఇంకా తేరుకోలేకున్నా.. సీటు బెల్ట్ వల్ల బతికా!
- IndiaGlitz, [Sunday,April 28 2019]
హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో వెళ్తున్న 'నువ్వు తోపురా' చిత్ర బృందంకు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న పూలమొక్కలకు నీరు పోస్తున్న ఓ మహిళను కారు అదుపు తప్పి ఢీ కొనగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్, హీరో సుధాకర్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పలువురు పలు రకాలుగా వార్తలు రాస్తుండటంతో చిత్రబృందం ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది..? ఏమైంది..? అనే విషయాలు చిత్రబృందం నిశితంగా వివరించింది.
షాక్ నుంచి ఇంకా తేరుకోలేకున్నా...
నా జీవితంలో అత్యంత బాధారమైన రోజు ఇది. ఇప్పటికీ నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. నేను ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేక పోతున్నాను. లక్ష్మీ గారు చనిపోవడాన్ని తట్టుకోలేక పోతున్నాను. వారి కుటుంబానికి మా వంతు సహాయం చేస్తాం. ఇలా జరుగడం దురదృష్టకరం. సినిమా ప్రమోషన్ కోసం వెళుతూ 11.30 గంటలకు మంగళగిరిలో ఉన్నాం. మా టీమ్‌తో కో-ఆర్డినేట్ చేసి పాసింజర్ సీట్లో కూర్చున్నాను. అందరికీ మెసేజ్ చేస్తుండగా సడెన్‌గా ఇలా యాక్సిడెంట్ జరిగిందిఅని ‘నువ్వు తోపురా’ హీరో మీడియాకు వివరించాడు.
సీటు బెల్ట్‌తో బతికిపోయా..!
లక్కీగా నేను సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల బ్రతికిపోయాను. లేకుంటే తలకు గాయాలయ్యేవి. యాక్సిడెంట్ అయ్యాక కొంతసేపు షాక్‌లోనే ఉన్నాను. అక్కడ ప్రజలంతా మాకు సహాయం చేశారు. అంబులెన్స్ పిలిపించి ఆస్పత్రికి పంపారు. డాక్టర్లు, పోలీసులు, మీడియా మిత్రులు చాలా హెల్ప్ చేశారు. మా డ్రైవర్ క్రిటికల్ కండీషన్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు అని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అందుకే ఎవరికీ చెప్పలేకపోయా..
ప్రమాదం జరిగినప్పుడు నా ఫోన్ మిస్సయింది. అందుకే వెంటనే ఎవరికీ సమాచారం అందించలేకపోయాను. కొన్ని వెబ్ సైట్లు నేను డ్రైవింగ్ చేస్తున్నట్లుగా రాశాయి. నేను డ్రైవింగ్ చేయలేదు.. అలా రాస్తున్న వారికి ఒకటే విన్నపం... అసలు విషయం తెలుసుకోకుండా ఇలాంటి పాల్స్ ఇన్ఫార్మేషన్ రాయవద్దు. మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది. ఇలాంటి వార్తలు విని బాధపడతారు అని యంగ్ హీరో సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు.