మనోజ్ ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి..
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు మనోజ్ నటించిన తాజా చిత్రం ఎటాక్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్ నటించిన ఎటాక్ ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, వడ్డే నవీన్ ముఖ్యపాత్రలు పోషించిన ఎటాక్ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ...మనోజ్ పాత్రకు తగ్గట్టు అద్భుతంగా నటించాడని విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఎటాక్ సినిమా గురించి రాసిన రివ్యూలన్నింటిలో సినిమా బాగాలేదు కానీ మనోజ్ నటన బాగుంది అని రాసారు.
ఎటాక్ రివ్యూలపై మనోజ్ స్పందిస్తూ...సినిమా ఫలితం మన చేతుల్లో ఉండదు. కానీ...పర్ ఫెర్మాన్స్ మాత్రం మన చేతుల్లో ఉంటుంది. ఎటాక్ సినిమా పై రాసిన అన్ని రివ్యూలతో నేను ఏకీభవిస్తున్నాను. పాత్రకు తగ్గట్టు బాగా నటించానని నన్ను అభినందించినందుకు థ్యాంక్స్ అంటూ ట్విట్టర్ లో స్పందించాడు. సినిమా బాగోలేదని రివ్యూ రాస్తే..నిజంగా సినిమా బాగోలేకపోయినా ఏ హీరో తట్టుకోలేడు. కానీ...మనోజ్ వాస్తవాన్ని అంగీకరిస్తూ...రివ్యూ రైటర్స్ తో ఏకభవిస్తున్నాను అనడం నిజంగా గ్రేట్. సద్విమర్శను స్వీకరించిన మనోజ్ నిజంగా నువ్వు గ్రేట్. మిగిలిన హీరోలు కూడా ఇలాగే ఆలోచిస్తే ఎంత బాగుంటుంది..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com