చిక్కుల్లో హైపర్ ఆది.. ద్వంద్వ అర్థాలతో డైలాగ్స్, రగిలిన వివాదం!
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడు, కమెడియన్ హైపర్ ఆది మరోసారి చిక్కుల్లో పడ్డాడు. జబర్దస్త్ తో పాటు మరికొన్ని టీవీ కార్యక్రమాల్లో హైపర్ ఆది చెప్పే డైలాగ్స్ పై గతంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మరోసారి వివాదం చెలరేగింది. ఓ టివి ఛానల్ లో నిర్వహించే ' శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే కార్యక్రమంలో హైపర్ ఆది చెప్పిన డైలాగులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఆర్జీవీ 'దిశ ఎన్కౌంటర్'ని రెండు వారాలు ఆపిన హైకోర్టు!
ఆ కార్యక్రమంలో హైపర్ ఆది.. తెలంగాణలో నిర్వహించే బతుకమ్మ పండుగ, దేవతలా పూజించే గౌరమ్మ, తెలంగాణ యాసపై ద్వంద్వ అర్థాలు వచ్చేలా డైలాగులు చెప్పారని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు ననవీన్ గౌడ్ ఎల్బీనగర్ ఎసిపి శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఆ కార్యక్రమంలో హైపర్ ఆది చెప్పిన డైలాగులు తెలంగాణ ప్రజల మనోభావాల్ని కించపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. మరోసారి ఇలాంటి స్క్రిప్ట్, డైలాగ్స్ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలి. అందుకే తాము హైపర్ ఆది, స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల సంస్థలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
హైపర్ ఆది బుల్లితెరపై కామెడీ పంచ్ డైలాగులతో అలరిస్తుంటాడు. ఒక్కోసారి ఆ డైలాగులే ఆదికి చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. జబర్దస్త్ ప్రోగ్రాంపై,హైపర్ ఆదిపై గతంలో అనేక సార్లు వివాదాలు చెలరేగాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com