హైదరాబాదీలను బెంబేలెత్తిస్తున్న కరోనా హాట్ స్పాట్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే జరగకపోయింటే పరిస్థితి ఈ పాటికే అదుపులోకి వచ్చేదేమో..! ఆ ఘటనతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మరీ ముఖ్యంగా మర్కజ్ సమావేశాలకు వెళ్లిన వారిలో తెలంగాణలో హైదరాబాద్ నుంచి.. ఏపీలో కర్నూలు నుంచి ఎక్కువగా వెళ్లడంతో ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి..? ఏయే ప్రాంతాలు కరోనాకు హాట్ స్పాట్స్..? ఏయే ప్రాంతాల్లో జనాలు అస్సలు తిరగకూడదు..? అనేదానిపై తాజాగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ హాట్ స్పాట్‌ల గురించి విన్న హైదరాబాదీలు బెంబేలెత్తిపోతున్నారు.
హైదరాబాద్ నగరంలో కరోనా హాట్ స్పాట్స్ ఇవే..
01. రాంగోపాల్‌పేట షేక్‌పేట
02. రెడ్ హిల్స్
03. మలక్‌పేట- సంతోష్‌నగర్
04. చాంద్రాయణగుట్ట
05. అల్వాల్
06. మూసాపేట
07. కూకట్‌పల్లి
08. కుత్బుల్లాపూర్- గాజులరామారం
09. మయూరినగర్
10. యూసుఫ్‌గూడ
11. చందానగర్
12. బాలాపూర్
13. చేగూరు
14. తుర్కపల్లి
వీటితో పాటు.. మేడ్చల్, మల్కాజిగిరిలో మరో మూడు ప్రాంతాలున్నాయి. కాగా ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అధికారులు చేపట్టారు. ఈ ప్రాంతాల్లో జనాలు అస్సలు బయటికి తిరగొద్దని ఇప్పటికే పోలీసుల నుంచి హెచ్చరికలు జారీ అయినట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments