హైదరాబాద్ సీన్.. తిరిగి యూపీలో రిపీట్ అయింది..
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌లో ఒక తండ్రి తన కుమారుడితో బైక్‌పై వెళుతుంటే పోలీసులు అడ్డుకుని నానా హంగామా చేశారు. ఆ సమయంలో ఆ చిన్నారి తన తండ్రిని విడిచిపెట్టండంటూ దారుణంగా ఏడుస్తూ పోలీసులను వేడుకున్న వీడియో బాగా వైరల్ అయ్యింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు బాలుడి ఇంటికెళ్లి చిన్నారితో కాసేపు సమయం గడిపి వచ్చిన విషయం తెలుగు ప్రజానీకానికి గుర్తుండే ఉంటుంది. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగింది.
బులంద్‌షహర్‌లో బాణసంచా విక్రేయదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్నఅతని కుమార్తె పోలీసు వాహనానికి తన తల బాదుకుంటూ, తన తండ్రిని విడిచిపెట్టాలని వేడుకుంది. కానీ పోలీసులు చిన్నారి అభ్యర్థనను పెడచెవిన పెట్టారు. ఒక కానిస్టేబుల్ ఏకంకా ఆ చిన్నారిని అక్కడి నుంచి తప్పించేందుకు యత్నించాడు. ఆ తరువాత తండ్రిని తీసుకుని పోలీసులు జీపుతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పాప తన తండ్రిని వదిలేయమంటూ దీనంగా వేడుకున్న వీడియో వైరల్‌గా మారింది. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో జిల్లా ఎస్ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ వరకూ వెళ్లింది. ఈ ఘటనకు కారకుడైన కానిస్టేబుల్ బ్రజ్వీర్‌పై చర్యలకు ఉపక్రమించారు. తరువాత ఎస్డీఎం, సీఓ తదితర పోలీసు అధికారులు ఆ చిన్నారి ఇంటికి వెళ్లి, అక్కడ దీపాలు వెలిగించి, స్వీట్లు పంచి ఆనందంగా దీపావళి వేడుకలు నిర్వహించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout