ఒక్క ట్వీట్ చాలు.. పోకిరీల పని ఫసక్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇవాళా.. రేపు ట్విట్టర్ ఖాతాలు అందరికీ ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్విట్టరే బాధితులకు వరంగా మారనుంది. మనల్ని ఎవరో వేధిస్తున్నారంటూ మన బంధువులకో.. సన్నిహితులకో చెబుతుంటాం. కొందరు బంధువులు బాగానే రియాక్ట్ అయినప్పటికీ కొందరు మాత్రం పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల పలు అనార్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఒక్క మాట ట్విట్టర్ ద్వారా పోలీసుల చెవిన కూడా వేశారనుకోండి.
ఇక పోకిరీల పని ఫసకే. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులతో పాటు ప్రతి ఠాణా సీఐ పేరుతోనూ ట్విట్టర్ ఖాతాలున్నాయి. ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. నిమిషాల్లో స్పందిస్తామని పోలీస్ బాసులు చెబుతున్నారు. మీరు ఎలాగైతే ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ఉపయోగిస్తున్నారో అలాగే ట్విట్టర్‌ను కూడా ఉపయోగించాలని చెబుతున్నారు. తమకు వచ్చే ట్వీట్‌లను ఫిర్యాదుగా స్వీకరించి పోకిరీల పని పడతామని సోషల్ మీడియా ద్వారా పోలీసులు ప్రచారం చేస్తున్నారు. మహిళలపై వేధింపుల పర్వం పెరుగుతోంది.
నంబర్ తెలిస్తే చాలు.. వివిధ నంబర్ల నుంచి కాల్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయాలను పోలీసుల వరకూ తీసుకెళితే అల్లరవుతామనే భయంతో బాధితులు మిన్నకుండి పోతున్నారు. దీంతో పోలీసులు ఈ స్టెప్ తీసుకున్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్ మీడియా ద్వారా వేధింపులను ఎదుర్కొంటున్న వారి కోసమే వాట్సాప్, ట్విట్టర్ సేవలను పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. బాధితుల వివరాలను సైతం పోలీసులు గోప్యంగా ఉంచుతారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments