New Year Celebrations : న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోన్న హైదరాబాదీలు.. పోలీసుల నిబంధనలు, ఉల్లంఘిస్తే..?
Send us your feedback to audioarticles@vaarta.com
మరికొద్దిరోజుల్లో క్యాలెండర్ మారనుంది. 2022 కాలగర్భంలో కలిసిపోయింది. సంతోషం, దు:ఖం, విజయాలు, పరాజయాల వంటి తీపి చేదు జ్ఞాపకాలను మిగిల్చి ఈ సంవత్సరం వెళ్లిపోతోంది. దీంతో కొత్త సంవత్సరం తమ కలలు నిజం కావాలని కోట్లాది మంది ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూఇయర్ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రపంచంలోని అన్ని దేశాల వాసులు రెడీ అయిపోయారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఇప్పటికే షాపింగ్ మాల్స్, క్లబ్‌లు, పబ్‌లు రకరకాల ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నాయి.
ఏం జరిగినా నిర్వాహకులదే బాధ్యత :
ఎప్పటిలాగే కొత్త సంవత్సర వేడుకలంటే పోలీసులకు చేతినిండా పనే. అర్ధరాత్రి దాటాక ఘర్షణలు, రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనలు మామూలే. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే మేల్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ఈ సారి కఠిన నిబంధనలు విధించారు. పీకలదాకా తాగి రోడ్లపై హంగామా చేస్తే కటకటాల వెనక్కి నెడతామని హెచ్చరిస్తున్నారు. న్యూఇయర్ వేడుకల్ని నిర్వహించే నిర్వాహకులు కూడా పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :
న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులు కొన్ని నిబంధనలు విడుదల చేశారు. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయరాదని, అలాగే యువతులు ధరించే దుస్తుల్లో అశ్లీలత కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. దీనితో పాటు వేడుకల్లో మాదక ద్రవ్యాలపై నిర్వాహకులు నిఘా వుంచాలని.. ఇలాంటి వెలుగులోకి వస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. అలాగే 45 డిసిబుల్స్ కంటే తక్కువ ధ్వని వచ్చే సౌండ్ సిస్టమ్ వినియోగించాలని, వేడుకలు నిర్వహించే చోట ఖచ్చితంగా సీసీ కెమెరాలు అమర్చాలని తెలిపారు. పరిమితికి మించి మద్యం సేవించిన వారిని దింపేందుకు క్యాబులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments