New Year Celebrations : న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోన్న హైదరాబాదీలు.. పోలీసుల నిబంధనలు, ఉల్లంఘిస్తే..?

  • IndiaGlitz, [Thursday,December 22 2022]

మరికొద్దిరోజుల్లో క్యాలెండర్‌ మారనుంది. 2022 కాలగర్భంలో కలిసిపోయింది. సంతోషం, దు:ఖం, విజయాలు, పరాజయాల వంటి తీపి చేదు జ్ఞాపకాలను మిగిల్చి ఈ సంవత్సరం వెళ్లిపోతోంది. దీంతో కొత్త సంవత్సరం తమ కలలు నిజం కావాలని కోట్లాది మంది ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూఇయర్ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రపంచంలోని అన్ని దేశాల వాసులు రెడీ అయిపోయారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఇప్పటికే షాపింగ్ మాల్స్, క్లబ్‌లు, పబ్‌లు రకరకాల ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నాయి.

ఏం జరిగినా నిర్వాహకులదే బాధ్యత :

ఎప్పటిలాగే కొత్త సంవత్సర వేడుకలంటే పోలీసులకు చేతినిండా పనే. అర్ధరాత్రి దాటాక ఘర్షణలు, రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనలు మామూలే. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే మేల్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ఈ సారి కఠిన నిబంధనలు విధించారు. పీకలదాకా తాగి రోడ్లపై హంగామా చేస్తే కటకటాల వెనక్కి నెడతామని హెచ్చరిస్తున్నారు. న్యూఇయర్ వేడుకల్ని నిర్వహించే నిర్వాహకులు కూడా పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :

న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులు కొన్ని నిబంధనలు విడుదల చేశారు. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయరాదని, అలాగే యువతులు ధరించే దుస్తుల్లో అశ్లీలత కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. దీనితో పాటు వేడుకల్లో మాదక ద్రవ్యాలపై నిర్వాహకులు నిఘా వుంచాలని.. ఇలాంటి వెలుగులోకి వస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. అలాగే 45 డిసిబుల్స్ కంటే తక్కువ ధ్వని వచ్చే సౌండ్ సిస్టమ్ వినియోగించాలని, వేడుకలు నిర్వహించే చోట ఖచ్చితంగా సీసీ కెమెరాలు అమర్చాలని తెలిపారు. పరిమితికి మించి మద్యం సేవించిన వారిని దింపేందుకు క్యాబులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.

More News

Satyam Rajesh:సత్యం రాజేష్ కొత్త చిత్రం ప్రారంభం!!!

సత్యం రాజేష్, రిహ, సునీత హీరో హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో

Omicron BF 7 Variant : కమ్ముకొస్తున్న కోవిడ్ ముప్పు... కాసేపట్లో మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష

మానవాళిని రెండేళ్ల పాటు నాలుగు గోడల మధ్య బందీని చేసి ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి పీడ వదిలిపోయిందని

Omicron BF 7:భారత్‌లో ఒమిక్రాన్ బీఎఫ్.7 కలకలం.... కేంద్రం హై అలర్ట్ , అన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో స్క్రీనింగ్

చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రపంచం ఆందోళనకు గురవుతోంది.

Korameenu: 'కొరమీను' ట్రైలర్.. డిసెంబర్ 31న మూవీ రిలీజ్

విజ‌య‌వాడ‌లో నేర‌స్థుల‌కు సింహ స్వ‌ప్నంగా ఉండే ఐపీఎస్ ఆఫీస‌ర్ మీసాల రాజు అలియాస్ సీతారామ‌రాజు

Khudiram Bose: డిసెంబర్ 22న పార్లమెంట్ సభ్యుల కోసం ‘ఖుదీరామ్ బోస్’ ప్రత్యేక ప్రదర్శన

ఈరోజు మ‌నం అనుభ‌విస్తున్న స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల కోసం ఎందరో మ‌హ‌నీయులు వారి ప్రాణాల‌ను తృణ ప్రాయంగా త్య‌జించారు.